For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు

By Nageswara Rao

లండన్, జులై 27: యావత్ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న 'లండన్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ' మరికొద్ది గంటల్లో మొదలవనుంది. లండన్‌లో ఈరోజు రాత్రి అంగరంగ వైభవంగా జరగనున్న ప్రారంభోత్సవ వేడుకతో అధికారికంగా 30వ ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా లండన్ కాలమానం ప్రకారం శుక్రవారం 8.12 గంటలకు ప్రతిష్టాత్మక బిగ్‌బెన్ గడియారం వరుసగా గంటలు కొట్టనుంది. మూడు నిమిషాల వ్యవధిలో ఇది 40 సార్లు మోగుతుంది.

London Olympics opening ceremony hours away

ఇలా గతంలో కింగ్ జార్జ్ VI చనిపోయిన రోజున మ్రోగించారు. మళ్లీ ఇన్నాళ్లకు బిగ్‌బెన్ గంటలు కొట్టనుంది. మామూలుగా ప్రతీ గంటకు ఆటోమెటిక్‌గా మోగినా... ఇప్పుడు మాత్రం స్వయంగా చేత్తో మోగించాల్సిందే. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 లాంఛనంగా ఒలింపిక్స్‌ను ప్రారంభించనున్నారు. 80 వేల సామర్థ్యం గల ఒలింపిక్ పార్క్‌లోని ప్రధాన స్టేడియం 'స్ట్రోన్ ఫోర్డ్' లో జరిగే ప్రారంభోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడి భార్య మిషెల్ ఒబామా సహా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

ప్రత్యక్షప్రసారం: రాత్రి ఒంటి గంట నుంచి ఈఎస్‌పీఎన్‌లో

ప్రపంచ వ్యాప్తంగా 204 దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహా సంబరంలో పాలుపంచుకోనున్నారు. భారత్ తరఫున 81 మంది బరిలోకి దిగుతున్నారు. రెజ్లర్ సుశీల్ కుమార్ పతాకధారిగా మార్చ్‌పాస్ట్‌లో ముందుండి నడవనున్నాడు. భారత్ నుండి వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, విజయ్ మాల్యా, సునీల్ మిట్టల్, రాహుల్ బజాజ్ తదితరులు హాజరవనున్నారు.

హాలీవుడ్ అందాల జంట బ్రాడ్ పిట్, ఏంజిలీనా జోలీలతో పాటు సాకర్ స్టార్ ఆటగాడు డేవిడ్ బెకహాం, ఫార్ములా వన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ లతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహామాన్ స్వరకల్పన చేసిన పంజాబీ పాట ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో అభిమానులను అలరించనుంది. 'నిమ్మా నిమ్మా' ధీమ్ తో ఈ పాట సాగుతుందని, ఇంగ్లాండ్‌లో ఉన్న భారతీయుల ప్రాభవాన్ని చాటుతుందని ఫేస్ బుక్‌లో రెహామాన్ పేర్కోన్నాడు.

వీటితో పాటు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్వరకల్పన చేసిన నాందాస్ పాట కూడా ప్రారంభోత్సవంలో అలరించనుంది. 1981లో కమల్ హాసన్ నటించిన రామ్ లక్ష్మణ్ సినిమాలో ఈ పాట ఇది. బిబిసి నాటక సంస్ద రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రారంభోత్సవంలో ప్రదర్శించనున్నారు. జేమ్స్ బాండ్ డానియేల్ గ్రెగ్ ఇందులో నటిస్తున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్ర దర్శకుడు డానీ బోయెల్ రూపకల్పనలో 'ఐస్లెస్ ఆఫ్ వండర్' పేరుతో సిద్ధం చేస్తున్న ఈ షోలో ఇంగ్లండ్ గ్రామీణ వాతావరణం, గ్రామీణ క్రికెట్, పల్లె పాటలు వంటి అంశాలు ఉంటాయి.

ఒలింపిక్ విశేషాలు:

ఒలింపిక్ జరగే రోజులు: 19

పోటీలు జరిగే క్రీడాంశాలు: 26

పోటీలు జరిగే క్రీడా వేదికలు: 34

పాల్గోంటున్న దేశాలు: 204

పతక విభాగాలు: 302

ఒలింపిక్స్‌ ఉపయోగిస్తున్న కంప్యూటర్లు: 15,000

ఉపయోగించనున్న క్రీడా వస్తువులు: 10,00, 000

లండన్‌కు వచ్చే సందర్శకులు: 20,00,000

మొత్తం అథ్లెట్లు: 10,500

మొత్తం జర్నలిస్టులు: 28,000

సిద్ధంచేసిన కండోమ్స్: 1.50 లక్షలు

ఏర్పాటుచేసిన కేబుల్స్ (క్రీడల ప్రసారానికి వీలుగా): 350 మైళ్లు

ఏర్పాటు చేయనున్న భోజనాలు: 1.40 కోట్లు

అమ్ముడైన టికెట్లు: 8.80 కోట్లు

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+