
ప్రపంచ టెన్నిస్‌లో మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్న రఫెల్ నాదల్ మాట్లాడుతూ లండన్ ఒలంపిక్స్‌లో నేను పాల్గొనే పరస్దితిలో లేను. మా స్పానిష్ బృందంతో కలిసి లండన్‌కు వెళ్లడం లేదు. మా జట్టు గురించే నా బాధంతా. నేను ఆడే పరిస్దితిలో లేనప్పుడు నా తోటి క్రీడాకారుడికి అవకాశమివ్వాలని కోరాను. ఇది తనను చాలా నిరాశకు గురి చేసిందన్నాడు. మోకాలి గాయంతో ఈ నెల 4వ తేదీన ఆడాల్సిన చారిటీ మ్యాచ్‌లోను అతను బరిలోకి దిగలేదు. రెండు సార్లు వింబుల్డన్ టైటిల్స్ సాధించిన రఫెల్ నాదల్‌కు లండన్‌లో మంచి రికార్డు ఉంది.
బీజింగ్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన నాదల్ ఈ ఒలింపిక్స్ ఆరంభవేడుకల్లో పతాకధారిగా తమ జట్టును ముందుండి నడిపించాల్సి ఉంది. చివరి నిమిషంలో నిష్ర్కమించడం అత్యంత బాధాకరమని అతను పేర్కొన్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాలన్నది నా కెరీర్ లక్ష్యం. కానీ అక్కడికి వెళ్లలేకపోవడం చాలా దురదృష్టకరమని నాదల్ అన్నాడు.
ఇదిలావుండగా, నాదల్ తప్పుకోవడంతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ స్వర్ణం ఆశలు మరింత మెరుగయ్యాయి. ఒలింపిక్స్ స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్న ఫెదరర్‌కు నాదల్ తప్పుకోవడం కలిసి వచ్చే అంశం. ఐతే జొకొవిచ్, ముర్రేల రూపంలో ఫెదరర్‌కు గట్టి పోటీ తప్పక పోవచ్చు.
తెలుగు వన్ఇండియా