Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టవర్ ఆఫ్ లండన్' లో ఒలంపిక్ మెడల్స్

London Olympics Medals Secure in Tower of London
లండన్, జూలై 26: ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకే కాదు వారికి బహూకరించే పతకాలకుకు కూడా భారీ స్థాయిలో భద్రత కల్పించా రు. ఎప్పుడూ నిఘానీడలో ఉండే, బ్రిటన్ రాజాభరణాల దాచి ఉంచే 'టవర్ ఆఫ్ లండన్'లో వీటిని భద్రపరిచారు. వీటిలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ విజేతలకు బహూకరించే 4,700 స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి.

410 గ్రాముల బరువుండే స్వర్ణ పతకంలో 6 గ్రాముల బంగారం మాత్రమే ఉంటుందట. మిగిలినది సిల్వర్ కాంపౌండ్, కాపర్ మిక్సింగే. అయినా ఒలింపిక్స్ చరిత్రలో ఖరీదైన, బరువైన(7 మిల్లీమీటర్ల మందంతో 85 మిల్లీమీటర్ల చుట్టుకొలత) పతకంగా కూడా రికార్డులకెక్కింది. బీజింగ్ ఒలింపిక్స్ పతకంతో పోల్చితే ఇది రెట్టింపుగా తూగుతుందట. ఐతే 2010లో వాంకోవర్ వింటర్ గేమ్స్ పతకం (576 గ్రా) బరువును మాత్రం ఇది అదిగమించ లేకపోయింది.

బ్రిటన్ చిత్రకారుడు డేవిడ్ వాట్కిన్స్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ పతకంపై ఒకవైపు గ్రీకు దేవత నైక్ బొమ్మ దర్శనమివ్వగా... మరోవైపు ఒలింపిక్స్ లొగోతో పాటు లండన్ గుర్తుగా థేమ్స్ నదిని ముద్రించారు. ఈ పతకాల తయారీకి కావాల్సిన ముడి ఖనిజాన్ని మంగొలియా, ఉటా (అమెరికా) గనుల నుంచి తెప్పించారు. ఈ ఒలంపిక్స్ మెడల్స్ ను రాయల్ మింట్‌లో తయారు చేశారు. ఆగస్ట్‌ 12న ఒలింపిక్స్‌, సెప్టంబర్‌ 9న పారా ఒలింపిక్స్‌ ముగుస్తాయి. అప్పటి వరకూ ఈ భారీ భద్రత కొనసాగుతుంది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+