Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలంపిక్స్: ప్రారంభ వేడుకలు కనివినీ ఎరుగని రీతిలో..!

లండన్, జులై 18: జులై 27 ఈరోజు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు లండన్ మహానగరం మూడోసారి ఒలంపిక్స్‌కు ఆతిధ్యం ఇస్తుంది కాబట్టి. ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని లండన్ నగరం ప్రపంచం మొత్తం అబ్బుర పరిచేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. మూడు గంటల పాటు నిర్వహించనున్న ఈ ఆరంభ వేడుకలు ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. 2008లో బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు ఒర్డ్ నెస్ట్ స్టేడియంలో ఎంతయితే ఘనంగా జరిగాయో అంతకుమించి ఘనంగా జరపాలని లండన్ ఒలంపిక్స్ సన్నాహాక కమిటీ నిర్ణయం తీసుకుంది.

London Olympics 2012

ఇందుకోసం గాను ప్రత్యేకంగా స్టాన్ ఫోర్డ్ ప్రధాన స్డేడియంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించారు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ దర్శకుడు డానీ బోయెల్. ఆరంభ వేడకల్లో బ్రిటన్‌ ప్రాచీన కాల వాతవరణాన్ని ప్రతిభించే విధంగా డిజైన్‌ చేశారు. వ్యవసాయ పొలాలు, చిన్న క్రికెట్‌ మైదానం, ఆవులు, గొర్రెలు, బాతులు, నాగళ్లు..ఇలా ఒక్కప్పటి గ్రామీణ బ్రిటన్‌ వాతారణ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఆరంభ వేడకల్లో దాదాపు 11 వేల మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ వేడుకలకు చైనా రూ 404 కోట్లు ఖర్చు చేస్తే లండన్ ఒలంపిక్స్ ఆరంభ వేడుకల కోసం రూ 232 కోట్లను ఖర్చుపెడుతున్నారు.

బీజింగ్‌ వేడకలను 4 వందల కోట్ల మంది వీక్షించగా.. ఈ వేడకలను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లమంది వీక్షిస్తారని అంచనా. ఈ వేడుకలకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బిల్లీ ఎలిట్‌ వ్యవహరిస్తున్నాడు. ఈ వేడకలు 27 రాత్రి 8.12 నిమిషాలకు ప్రారంభం కానున్నాయి. తొలుత బిబిసి డ్రామా విభాగం రూపొందించిన ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న జేమ్స్‌ బాండ్‌ హీరో డ్యానియెల్‌ క్రేగ్‌‌తో పాటు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కూడా ఇందులో నటించారు. తర్వాత క్రేగ్‌ హెలికాప్టర్‌ నుంచి తాడు లేదా పారాసుట్‌ సహాయంతో స్టేడియంలోకి దిగుతాడు.

తర్వాత 'గ్రీన్‌ అండ్‌ ప్లిసెంట్‌'తో గ్రామీణ వాతావరణం సృష్టించనున్నారు. సర్‌ పాల్‌ మెక్‌కార్టినీ మూడు పాటలు పాడనున్నాడు. 50 మంది డ్యాన్సర్లు పేపర్‌ క్యాస్టుమ్స్‌తో నృత్యాలు చేయనున్నారు. 2010 బ్రిటన్‌ టాలెంట్‌ విన్నర్‌ బృందం బ్రిటన్‌ గ్రామీణ నృత్యాలతో అలరించనుంది. ఒలంపిక్ ఆరంభ వేడుకలు రాత్రి 12.30 నిమిషాలకు ముగుస్తాయి.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+