లండన్ ఒలింపిక్స్: బికినీలుంటాయా, ఉండవా?
లండన్: బికినీలతో ఆడితేనే బీచ్ వాలీబాల్‌కు సొగసు, సౌందర్యమంటారు. అభిమానులకు ఊర్రూతలూగించే ఆనందం. అయితే, లండన్‌లో ఇప్పుడు చలి దంచేస్తోంది. దీంతో బికినీలను సడలించి, కాస్తా పొడవైన దుస్తులను ధరించడానికి అధికారులు అవకాశం కల్పించారు. అయితే, దీనిపై క్రీడాకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాత్రి ఆలస్యంగా ఈ మ్యాచులుంటాయి. పైగా ఒంటిని కొరికేసే చలి. అందువల్ల నిబంధనలను సడలించి క్రీడాకారులకు కాస్తా వెసులుబాటు ఇచ్చారు. ఈ వెసులుబాటు మహిళలకు మంచిదేనని ఆస్ట్రేలియాకు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి టాంసిన్ హించ్‌లే అంటున్నారు.
తమ కండలను వెచ్చగా ఉంచుకోవడం తమకు ముఖ్యమని, ఈ ఆటలో విపరీతంగా శ్రమించాల్సి ఉంటుందని ఆమె అంటోంది. అయితే, బ్రిటన్ జటం జరా డాంవ్‌నే, షౌనా ములిస్ జంట అభిప్రాయం మరో విధంగా ఉంది. నిబంధనలు మారినా తాము బికినీలనే ధరిస్తామని అంటోంది. లండన్ వాతావరణానికి ఇది వరకే ఈ జంట అలవాటు పడింది కాబట్టి బికినీలైనా చలి శరీరాలను ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఇతర దేశాల క్రీడాకారులకు ఇది ఇబ్బందికరంగానే ఉంటుందని అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications