
శనివారం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వీరికి ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అందజేశారు. కాగా ఈ గౌరవ డాక్టరేట్‌ల పట్ల వీటిని అందుకున్న వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు తనను మెడిసిన్ చదివించాలని భావించారని, భగవంతుడు మాత్రం తన కేరీర్‌ను ఇటు వైపు మరల్చారని సైనా నెహ్వాల్ ఈ సందర్భంగా చెప్పారు.
ఈ రోజు డాక్టరేట్‌ను అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. డాక్టరేట్ల ప్రదానం అనంతరం ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు ఆటగాళ్లు కూడా రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఆటగాళ్లకు ఉంటే చరిష్మా ఉపయోగించుకొని వారు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలకు మంచి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.