For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డోపింగ్‌లో దొరికిన ఫౌండేషన్‌కు వెల్లువెత్తిన విరాళాలు

By Nageswara Rao
Lance Armstrong
ఆస్టిన్, ఆగస్టు 26: ఏడుసార్లు టూర్‌ డి ఫ్రాన్స్‌ టైటిల్స్‌ గెల్చుకుని సైక్లింగ్‌లో దిగ్గజంగా నిలిచిన అమెరికా సైక్లిస్ట్‌ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ డోపింగ్‌కు పాల్పడినట్లు నిర్దారిస్తూ అతనిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ డోపింగ్ నిరోధిక సంస్ద (వాడా) ప్రకటించిన రోజునే లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ బాధితుల సహాయక సంస్ద 'లివ్ స్ట్రాంగ్'కు విరాళాలు వెల్లువెత్తాయి. ఒక్క శుక్రవారం రోజు రూ. 42 లక్షల రూపాయలు వచ్చాయి. ముందు రోజు వచ్చిన విరాళాలకు ఇది 20 రెట్లు సమానం.

దాదాపు 400 మంది వరకు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు విరాళాలు అందేజేశారు. సంస్ద కార్యాలయానికి వందలాది మంది ఫోన్లు చేసి ఆర్మ్‌స్ట్రాంగ్‌కు మద్దతు ప్రకటించారు. క్యాన్సర్‌ పోరులో విజేత నిలిచిన లాన్స్‌ డోపింగ్‌పై పోరాటంలో ఓడిపోయాడు. అమెరికా యాంటీ డోపింగ్‌ ఏజన్సీ (యుఎస్‌ఎడిఎ)తనపై చేసిన డోపింగ్‌ ఆరోపణలపై పోరాటాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు లాన్స్‌ గురువారం రాత్రి ఒక లిఖిత పూర్వక ప్రకటన చేశాడు.

ఈ లిఖిత పూర్వ ప్రకటనలో 'ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి దశ ఒకటి వస్తుంది. అయ్యిందేదో అయ్యింది. 1999 నుంచి ఏడు టైటిళ్లు గెలవడానికి తప్పుడు మార్గాలను అవలంభించానని అన్యాయంగా నాపై ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం నా స్థితి వల్ల కుటుంబం, ఫౌండేషన్ ఇబ్బందులు పడుతోంది. ఈ అర్థంలేని వాదనలతో విసిగిపోయాను. ఏడు టైటిళ్లు ఎవరు గెలిచారో నాకు, నా సహచరులకు తెలుసు. ఎలాంటి ప్రత్యర్థులపై ఇవి సాధించానో కూడా తెలుసు. ఆర్బిట్రేషన్ విధానంపై కూడా నమ్మకం పోయింది. కాబట్టి ఆ కోర్టులో కూడా పోరాడదల్చుకోలేదు' అని ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నాడు.

'నేను ఎలాంటి తప్పూ చేయలేదు... కానీ న్యాయస్థానాల ఏకపక్ష తీర్పులపై పోరాడలేను'... ఇది ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నమాట. 'ఏ తప్పూ చేయకపోతే మధ్యలోనే వైదొలగడమెందుకు..? అంటే.. అతడు పరోక్షంగా తన నేరాన్ని అంగీకరిస్తున్నట్టే'... ఇది అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ (యూఎస్‌ఏడీఏ) వాదన. జరిగిందేదో జరిగిపోయిందని తన వెబ్‌సైట్‌లో లాన్స్‌ రాశాడు. మరోవైపు తన టైటిళ్లను రద్దు చేసే అధికారం అమెరికా ఏజన్సీకి లేదని 40 ఏళ్ల ఈ మేటి సైక్లిస్ట్ అన్నాడు.

1996లో వృషణాల క్యాన్సర్ బారిన పడిన ఆర్మ్‌స్ట్రాంగ్ బ్రతికే అవకాశాలు 50 శాతం కంటే తక్కువేనని డాక్టర్లు తేల్చారు. ఐతే ధైర్యంతో కీమోథెరఫీ, శస్త్రచికిత్సలతో కోలుకున్నాడు. అతను 1999లో తొలిసారి టూర్ డి ఫ్రాన్స్‌ను గెలవడంతో అమెరికా ప్రజలకు హీరోగా మారాడు. 2005 వరకు వరుసగా మరో ఆరు టైటిళ్లు గెలిచి సైక్లింగ్‌లో కొత్త చరిత్రని సృష్టించాడు. అమెరికా వ్యాప్తంగానే కాక ప్రపంచంలోని క్యాన్సర్ రోగులందరిలో ధైర్యాన్ని నింపాడు. భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఆర్మ్‌స్ట్రాంగ్ బయోగ్రఫీని స్ఫూర్తిగా తీసుకుని క్యాన్సర్‌ను జయించిన విషయం తెలిసిందే.

డోపింగ్‌కు పాల్పడినట్లు నిర్దారిస్తూ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై ఫ్రొఫెషనల్‌ సైక్లింగ్‌లో జీవిత కాల నిషేధం విదిస్తున్నట్లు, అతడు సాధించిన ఏడు టూర్స్‌ ఫ్రాన్స్‌ టైటిల్స్‌ కూడా వెనక్కి తీసుకోనున్నట్లు యుఎస్‌ఎడిఎ అధికార ప్రతినిధి అనై స్కిన్నర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 'ఈ రోజు క్రీడా ప్రేమికులందరికి, అథ్లెటిక్‌ హీరోకు విచారించదగ్గ రోజు.' అని యుఎస్‌ఎడిఎ ఎగ్జిక్యూటివ్‌ చీఫ్‌ ట్రావిస్‌ ట్యాగార్ట్‌ పేర్కొన్నారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+