Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్: డిస్కస్ త్రోలో ఏకైక ఆశ కృష్ణ పూనియా

Krishna Poonia
కోల్‌కతా: ఇప్పుడు భారత డిస్కస్‌త్రో మహిళా విభాగంలో వినిపిస్తున్న ఏకైక పేరు కృష్ణ పూనియా. ఆమెతో పాటు వికాస్‌ గౌడా కూడా లండన్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. అయితే ఈ విభాగంలో స్వర్ణ పతకం సాధించడం కష్టం కావచ్చునని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సోమవారం నాడు తన మనసులో వూట బయటపెట్టింది. ఒక వేళ లండన్‌లో పసిడి సాధ్యమైతే అది ఎంతో ఆశ్చర్యకమైందేనని అంటోంది. లండన్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల రికార్డుకు ఎంతో అంతరం ఉన్నప్పటికీ మన దేశం తరపున డిస్కస్‌ త్రో పోటీలకు ఎంపికైన కృష్ణపూనియా, వికాస్‌ గౌడలతో పాటు 20 కిలో మీటర్ల నడక విభాగంలో పోటీ పడుతున్న గుర్మిత్‌సింగ్‌ ప్రతిభ ప్రత్యేకమైన గుర్తింపు కల్గిందరి వివరించింది.

ఇటీవలి కాలంలో వారు చాలా వ్యక్తిగత ఈవెంట్లను పూర్తి చేశారని, అందులో వారు సానుకూలమైన ఫలితాలనే సాధించారని అయితే అంత మాత్రాన ఒలింపిక్స్‌లో బంగారు పతకం అసాధ్యమని, అయితే వారు సాధించినా ఆశ్చర్యపోవల్సిందేమీ లేదని ఎఎఫ్‌ఐ సెక్రెటరీ జనరల్‌ సికె వల్సన్‌ ఓ వార్త సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'నేను మాత్రం పతకం వస్తుందనో.. లేక రాదనో చెప్పలేనని' అన్నారు. 'మేము పతకంపెై పూర్తి నమ్మకంతోనే ఉంటున్నాం. కానీ పోటీరోజు వారు అక్కడ ప్రదర్శించిన తీరు మీద ఆధారపడి ఉంటుంద'ని ఆయన వివ రించాడు.

భారతదేశం తరపున 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మిల్కా సింగ్‌ అప్పట్లో 400 మీటర్ల పరుగు పందెం విభాగంలో అత్యుత్తమ ప్రదర్శననను ఇచ్చి నాలుగో స్థానంలో నిలిచాడు. అప్పటికే 1984 లాస్‌ ఏంజిల్స్‌ లో పాల్గొన్న పీటీ ఉషా అప్పట్లో కాంస్య పతకాన్ని కూడా చేజార్చుకుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్లను 14 మందికే పరిమితం చేయడంతో భారత అథ్లెట్లు కేవలం టింకూ లూకస్‌ (800 మీటర్ల విభాగంలో), సుధాసింగ్‌ (3000 మీటర్ల విభాగంలో) ఇద్దరు మాత్రమే బరిలో నిలిచారని, అయితే ఎఎఫ్‌ఐ సరెైన ప్రణాళికతో క్రీడాకారులకు శిక్షణ ఇవ్వని కారణంగానే ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ప్రీజా శ్రీధరన్‌, కవితా రౌత్‌ లండన్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక కాలేదంటూ వస్తున్న విమర్శలను తొసిపుచ్చిన వల్సన్‌ అథ్లెట్లకు అవసరమైన స్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చామని పేర్కొన్నారు.

అనుకోకుండా గాయం పాలెైన కారణంగా ప్రారంభంలో అబ్రహాం అర్హత పోటీలకు దూరమయ్యాడని, గాయం కారణంగానే ఏప్రిల్‌-జూన్‌ నెలలలో జరిగిన ఇండియన్‌ జిపితో పాటు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఆయన హాజరుకాలేకపోయాడని తెలిపాడు. ఇది చాలా దురదృష్టకర సంఘటన అని వల్సన్‌ వివరించాడు. తర్వాత క్రమంలో గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆయనకు చాలా అవకాశాలు కల్పించా మని, ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు కోసం జరిగిన అంతర్జాతీయ పోటీలకు కూడా అవకాశం కల్పించామని చెప్పాడు.

ఆ తర్వాత కూడా తాను ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌, ఏషియన్‌ ఆల్‌- స్టార్‌లో పాల్గొన్నప్పటికీ లక్ష్యానికి చేరుకోలేకపోయాడని అన్నాడు. కవితా, ప్రీజ గురించి ప్రస్థావించిన వల్సన్‌ వారు బాగానే కృషి చేశారని, కెన్యాకు చెందిన టాప్‌ కోచ్‌ దగ్గర శిక్షణ కూడా తీసుకు న్నారని, అయితే ఒక్క సుధాసింగ్‌ మాత్రమే 3000 మీటర్ల స్టీపెల్‌ ఛేస్‌లో ఒలింపిక్స్‌ బి-స్టాండేర్ట్‌ మార్క్‌ను చేరుకోగల్గిందని పేర్కొన్నారు. టింకూ లూకస్‌ విషయానికొస్తే 800 మీటర్ల విభాగంలో ఆమె సాధన పూర్తిగా విరుద్ధంగా ఉండేదని, యురోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్థాయిలో బాగానే కృషి చేసిందని, అయినప్పటికీ ఆమె సామర్థ్యం సరిపోలేనందున అవకాశం కల్పించడంలో తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని వివరించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+