Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సినిమాల్లో నటించనన్న కోనేరు హంపీ: రేసులో సైనా

Koneru Humpy - Saina Nehwal
విజయవాడ/ కౌలాలంపూర్ : సినిమాల్లో నటించాలన్న ఆసక్తి తనకు లేదని చెస్ క్రీడాకారిణి, పద్మశ్రీ కోనేరు హంపి స్పష్టం చేసిం ది. ఇటీవల విశాఖలో క్రీడా పీఠం ఏర్పాటు చేసిన సం దర్భంలో తనను సినీ హీరోయిన్‌లా ఉన్నావని టి.సుబ్బరామిరెడ్డి ప్రశంసించడంతో సినిమాల్లో నటిస్తానని పత్రికల్లో వార్తలు వచ్చాయని, అంతేగాని తనకు సినిమాల పట్ల ఆసక్తిలేదని ఆమె చెప్పింది.

కేవలం తనకు చదరంగంలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు సాధించాలనే ధ్యేయం మాత్రమే ఉందని తెలిపింది. ఏప్రిల్ 12 నుం చి బ్యాంకాక్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ పోటీలు, మే నెలలో స్విట్జర్లాండ్‌లో జరిగే గ్రాండ్ ప్రీ పోటీలలో పాల్గొంటున్నానని హంపి చెప్పింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తి తనకు ఉందని కోనేరు హంపి చెప్పినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యూఎఫ్) మహిళా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు - 2012కు నామినేట్ అయింది. ఈ అవార్డుకు మొత్తం ఐదుగురు నామినేట్ అయ్యారు.

ఐదుగురిలో సైనా నెహ్వాల్ మినహా మిగతా నలుగురు కూడా చైనాకు చెందిన క్రీడాకారిణులే. ప్రపంచ నెంబర్ 2 సైనా 2012లో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించడమే కాకుండా నాలుగు ప్రధాన టైటిళ్లను గెలుచుకుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+