ఆఖరి రౌండ్ మొదలయ్యే ముందు హంపి, ముజిచుక్ అనా 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే మోనికాతో గేమ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హంపి.. అద్భుత విజయంతో కీలకమైన ఒక పాయింట్‌ను సాధించగా, రూవాన్ లూఫీతో జరిగిన పోరును డ్రా చేసుకున్న ముజుచిక్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కాగా, జావో జు (చైనా) 7.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నీ మొత్తంలో హంపి ఏడు విజయాలు సాధించి, ఓ గేమ్‌లో ఓటమిపాలైంది. మూడు గేమ్‌లు డ్రా చేసుకుంది. ఈ విజయంతో హంపి ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లతోపాటు 40 బోనస్ పాయింట్లు చేరాయి.
రూ. 4.43 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఇక మొత్తం 14 అంతర్జాతీయ రేటింగ్ పాయింట్లు దక్కించుకున్న హంపి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది.