
కెరీర్‌లో 41 డబ్ల్యుటీఏ సింగిల్స్, 11 డబుల్స్ టైటిల్స్‌ను గెలిచిన ఆమె 4 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2005, 2009, 2010 యూఎస్ ఓపెన్‌తో పాటు 2011 ఆస్ట్రేలియా ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కిమ్ క్లియ్‌స్టర్ మే 2007లో తొలిసారి టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. 2008లో పాపకు జన్మనిచ్చిన ఆమె మార్చి 2009లో టెన్నిస్‌లోకి మళ్లీ పునరాగమనం చేసింది. అదే ఏడాది యూఎస్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డుతో బరిలోకి దిగి టైటిల్‌ను గెలిచింది. 2003లో 12 వారాల పాటు నంబర్‌వన్‌గా కొనసాగింది.
ఇక భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కొలిన్ ఫ్లెమింగ్ (బ్రిటన్) జోడి యుఎస్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా-ఫ్లెమింగ్ 6-2, 7-6 (7/5)తో పెట్‌కోవిచ్ (బ్రిటన్)-ఎరిక్ బట్రోక్ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. పురుషుల డబుల్స్‌లో ఎనిమిదోసీడ్ మహేశ్ భూపతి-రోహన్ బోపన్న 3-6, 6-7 (4/7)తో మాథ్యూ ఎబ్డెన్-బెర్నార్డ్ టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. యుఎస్ ఓపెన్‌లో సానియా మిర్జా - మహేశ్ భూపతి ఇద్దరూ వేరు వేరు జోడీలతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా