Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదృష్టం.. స్పెయిన్‌తో పాటు ఇటలీ నాకౌట్‌కు అర్హత

Italy down Ireland to reach quarter-finals
పొజ్నాన్ (పోలండ్), జూన్ 20: యూరో కప్‌లో అదృష్టం అంటే ఇటలీదే అంటున్నారు పుట్ బాల్ నిపుణులు. గ్రూప్ 'సి' చివరి రౌండ్ కీలక లీగ్ మ్యాచ్‌లో ఇటలీ 2-0 గోల్స్ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. ఇది ఇలా ఉంటే మరో మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో క్రొయేషియాపై గెలువడంతో... డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌తోపాటు ఇటలీ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఒకవేళ స్పెయిన్, క్రొయేషియా మ్యాచ్ 2-2తో 'డ్రా'గా ముగిసి ఉంటే ఇటలీ ఇంటిదారి పట్టేది. కానీ ఇటలీకి విజయంతోపాటు అదృష్టం కూడా కలిసి రావడంతో నాకౌట్‌లోకి ప్రవేశించింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

అంతక ముందు జరిగిన మ్యాచ్‌లలో స్పెయిన్, క్రొయేషియా జట్లతో జరిగిన మ్యాచ్‌లను 'డ్రా' చేసుకున్న ఇటలీ, ఐర్లాండ్‌పై పూర్తిగా ఆధిపత్యాన్ని కనబరిచింది. ఆట 35వ నిమిషంలో ఆండ్రియో పిర్లో కార్నర్ షాట్‌ను కసానో 'హెడర్' షాట్‌తో గోల్‌గా మలిచి ఇటలీకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత ఆట 90వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మారియో బలోటెలి బైసైకిల్ కిక్ షాట్‌తో ఇటలీ ఖాతాలో రెండో గోల్ చేరింది. దీంతో ఇటలీ విజయం నల్లేరుపై నడకలాగా మారింది.

ఆ తర్వాత క్రొయేషియాను స్పెయిన్ ఓడించడంతో ఇటలీ ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా '2004 యూరో'లో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటలీ ఇంటిదారి పట్టింది. కానీ ఈ సారి మాత్రం అదృష్టం ఇటలీని వరించింది. ఆరోజు బల్గేరియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కసానో చేసిన గోల్‌తో ఇటలీ గెలిచింది. కానీ అదే గ్రూప్‌లో డెన్మార్క్, స్వీడన్ చివరి లీగ్ మ్యాచ్ 2-2తో 'డ్రా' కావడంతో ఇటలీ లీగ్ దశలోనే నిష్ర్కమించింది.

'ఎనిమిదేళ్ల క్రితం నేను మా జట్టును గెలిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కానీ ఈసారి మా జట్టు నాకౌట్ దశకు చేరుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని 2004లో ఇటలీ నిష్ర్కమణతో భోరున విలపిస్తూ మైదానంలోనే కుప్పకూలిన కసానో వ్యాఖ్యానించాడు.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 9.30 గంటలకు స్వీడన్ వర్సెస్ ప్రాన్స్

రాత్రి 12.15 గంటలకు నుంచి ఇంగ్లండ్ వర్సెస్ ఉక్రెయిన్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+