న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్‌ బోల్తా, సెమీస్‌లో ఇటలీ

By Nageswara Rao
Italy beat England on penalties to reach Euro 2012 semis
కీవ్ (ఉక్రెయిన్), జూన్ 26: పుట్‌బాల్ ఆటలో ఎప్పుడు ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. చివరి క్వార్టర్ ఫైనల్లో రెండు జట్లూ నిర్ణీత 90 నిమిషాల్లో... ఆ తర్వాత అదనపు 30 నిమిషాల్లో గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి షూట్‌అవుట్ అనివార్యమైంది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఒత్తడిని అధిగమించి ఇటలీ పెనాల్టీ షూట్‌అవుట్‌లో 4-2తో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

షూటౌట్‌లో ఒక్కో జట్టుకి 5 గోల్స్‌కు అవకాశం ఇచ్చారు. ఇటలీ ఆటగాళ్లు మారియో బలోటెల్లీ, ఆండ్రియా పిర్‌లో, ఆంటినియో నోసెరినో, అలెసాండ్రో డైమాంతి తలా ఒక గోల్స్‌ చేశారు. రికార్డో మోంటోలివో గోల్‌ మిస్‌ చేశాడు. ఇంగ్లండ్‌ తరుపున స్టీవెన్‌ గెరార్డ్‌, వ్యానే రూనీ చెరో గోల్స్‌ చేశారు. అషెల్లీ యోంగ్‌, అషెల్లీ కోలే గోల్‌, గాలెన్‌ జాన్సన్‌ చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్‌ 2-4తో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇటలీ గోల్‌ కీపర్‌ బఫోనో మూడు గోల్స్‌లను అద్భుతంగా అడ్డుకున్నాడు. గతంలో ఇంగ్లండ్‌ యూరో 2004, 2006 ప్రపంచ కప్‌లో పెనాల్టీ షూటౌట్‌లోనే ఓడింది. షూట్‌అవుట్లో పేలవమైన రికార్డే ఇంగ్లండ్ కొంప ముంచింది.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

2006 ప్రపంచ కప్‌ను కూడా ఇటలీ పెనాల్టీ షూటౌట్‌ ద్వారానే గెల్చుకుంది. గురువారం జరగనున్న మరో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఇటలీ, జర్మనీతో తలపడుతుంది. మూడుసార్లు విజేత అయిన జర్మనీతో జరిగే ఈ మ్యాచ్‌ పొలాండ్‌లోని వార్సాలో జరగనుంది. తన దృష్టిలో ఇటలీ క్రీడాకారులు అద్భుతంగా ఆడారని అన్నారు. ప్రత్యర్ధుల జట్టుకు చెమటలు పట్టించారని సీజర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఇటలీ కోచ్ మాట్లాడుతూ పెనాల్టీ షూటవుట్‌లో ఇటలీ గోల్‌కీపర్‌ గియాన్‌ల్విగీ తన చెంపలను తాకుకుంటున్న వెళ్లిన బంతిని అడ్డుకుని గోల్‌ కానీయకుండా చేయడం మ్యాచ్ విజయానికి కారణం అన్నాడు.

యూరో 2012: సెమీ ఫైనల్స్

జూన్ 27: పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్

జూన్ 28: జర్మనీ వర్సెస్ ఇటలీ

నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X