
ఇది ఇలా ఉంటే ఒలింపిక్స్ నుండి పురుషుల విభాగంలో కూడా భారత ఆర్చరీ జట్టు నిష్క్రమించింది. శనివారం తీవ్ర ఉత్కంఠ మధ్య లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన పోటీల్లో జపాన్ జట్టు చేతిలో భారత జట్టు ఓడిపోయింది. జయంత్ తాలూక్ దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్ దీప్ రాయ్ శుక్రవారం జరిగిన రౌండ్ లో 12వ ర్యాంక్ సాధించారు. అయితే, జపాన్ తో జరిగిన పోటీలో శనివారం ఓడిపోయారు. జపాన్ కు చెందిన యూ ఇషిజూ, హిడెకీ కికుచి, తకహరు ఫురుకువా జట్టు భారత్ పై గెలిచింది.
రెగ్యులేషన్ ప్లేలో రెండు పాయింట్లు లీడ్ లో ఉన్న భారత క్రీడాకారులు టై బ్రేకర్ తో జపాన్ క్రీడాకారులు సమం చేశారు. దీంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత క్రీడాకారులు ముగ్గురు సోమవారం జరిగి వ్యక్తిగత ఎలిమినేషన్స్ రౌండ్స్ లో పాల్గొనున్నారు.
తెలుగు వన్ఇండియా