ఎన్నికల్లో కేంద్రం జోక్యం: భారత ఒలింపిక్ సంఘంపై వేటు

ఒలింపిక్స్ నుండి భారత్‌ను కూడా నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఒలింపిక్ చార్టర్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గతంలో స్పష్టం చేసింది. అయితే ఎన్నికల విషయంలో మాత్రం కేంద్రం జోక్యం చేసుకోవడంతో ఐఓసి సీరియస్ అయింది.
సస్పెన్షన్ ఇలాగే కొనసాగితే 2016లో జరిగే ఒలింపిక్ క్రీడలో భారత్ క్రీడాకారులు పాల్గొనే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా భారత్‌లో క్రీడాభివృద్ధికి ఐఓసి నిధులు కూడా నిలిపి వేస్తుంది. ఐఓసి తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్‌గా కళంకిత లలిత్ భానోత్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా అభరు సింగ్ చౌతాలా కూడా శుక్రవారం ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు. కామన్వెల్తు అవినీతిలో అరెస్టయిన భానోత్ గతేడాది పదకొండు నెలలు జైలులో ఉన్నారు. ఒలంపిక్స్‌లో కళంకిత వ్యక్తులు ఉండరాదనేది ఐఓసి నిర్ణయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications