
లండన్ ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత్ సాధించిన రెండు పతకాలు కూడా షూటింగులోనే వచ్చాయి. గగన్ నారంగ్ కాంస్య పతకం సాధించాడు. ఆర్మీలో పని చేస్తున్న విజయ్ కుమార్ రెండో పతకం సాధించాడు. ఫైనల్ ఎనిమిది సిరీస్‌ల్లో 26 ఏళ్ల విజయ్ కుమార్ షాట్ సీక్వెన్స్ 5,4,43,4,4,4,2తో 30గా నమోదైంది.
క్యూబాకు చెందిన లూరిస్ పుపో 34 పాయింట్లు సాధించి స్వర్ణపతకం సాధించాడు. క్వాలిఫైంగ్ రెండో దశ పోటీల్లో శుక్రవారం ఉదయం విజయ్ 585 స్కోరుతో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ 583.
గురువారం క్వాలిఫయింగ్ మొదటి దశలో 293 స్కోరును సాధించాడు. పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ ఈవెంట్‌లో విజయ్ ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ పోటీల్లో సైనా నెహ్వాల్ ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. రేపు శనివారం ఆమె మూడో స్థానం కోసం పోటీ పడుతుంది. ఇందులో గెలిస్తే ఆమెకు కాంస్య పతకం లభిస్తుంది.
ఒలింపిక్స్‌లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో పతకం తెస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న షూటర్ రంజన్ సోధి అభిమానుల ఆశలను నిరాశకు గురి చేశాడు. ఫైనల్స్‌కు చేరుకోవడంలో సోథీ విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో మొత్తం 50 పాయింట్లకుగాను 48 పాయింట్లు చేసి, టాప్ స్థానంలో నిలిచినప్పటికీ.. తర్వాతి రెండు రౌండ్లలో 44, 42 పాయింట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో రంజన్ 150 పాయింట్లకు గాను 134 పాయింట్లు సాధించి 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.