Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివరి వరకు ఉత్కంఠ: ముగిసిన పేస్, భూపతి వివాదం

Leander Peas - Vishnuvardhan
న్యూఢిల్లీ, జూన్ 21: ఎట్టకేలకు లియాండర్ పేస్, మహేష్ భూపతి, రోహాన్ బోపన్నల వివాదం ఒక కొలిక్కి వచ్చింది. భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) లండన్ ఒలంపిక్స్‌ కు రెండు జట్లను పంపాలని నిర్ణయం తీసుకుంది. గురువారం భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) విడుదల చేసిన అధికారిక ప్రకటనలో లండన్ ఒలంపిక్స్‌కు రెండు జట్లను పంపాలని నిర్ణయం తీసుకుంది. మొదట టీమ్‌గా లియాండర్ పేస్‌తో జోడిగా హైదరాబాద్‌కు చెందిన జగదీషన్ విష్ణువర్దన్‌ని ఎంపిక చేయగా.. రెండవ టీమ్‌కు ఆడేందుకు మహేష్ భూపతి, రోహాన్ బోపన్నలను ఎంపిక చేసింది.

ఈరోజు (గురువారం ) లండన్ ఒలంపిక్స్‌కు టీమ్స్‌ను పంపంచడం చివరి రోజు కావడంతో భారత టెన్నిస్ సంఘం తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో గత కొన్ని రోజులుగా భారత టెన్నిస్ సంఘానికి, ఆటగాళ్లకు మధ్య జరుగుతున్న సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. మొదట్లో లండన్ ఒలంపిక్స్‌కు మహేష్ భూపతి, లియాండర్ పేస్‌ను పంపాలని భారత టెన్నిస్ సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విభేధించి మహేష్ భూపతి, ఫేస్‌తో ఆడనని ఖరాఖండిగా తెలపడంతో భారత టెన్నిస్ సంఘం సంధిగ్దంలో పడింది. దీంతో భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) మాత్రం తమ ముందు ఉన్న ప్రత్నామయాలను వెల్లడించింది.

ఏఐటీఏ సూచించిన ప్రత్యామ్నాయాలు:

* సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పేస్, భూపతి జట్టుగా ఒలంపిక్స్‌‌కు వెళ్లాలి.
* అలా కుదరకపోతే పేస్, బోపన్న కలిసి వెళ్లాలి. ఒక్క జట్టే పంపాలని నిర్ణయించుకున్నారు కాబట్టి దీంతో భూపతికి ఒలింపిక్స్ ఆడే అవకాశం దక్కదు.
* రెండు జట్లను పంపాలంటే పేస్‌కు జతగా యూకీ బాంబ్రీ లేదా విష్ణువర్ధన్‌ను ఎంపిక చేయాలి. భూపతి, బోపన్న జంటగా మరో జట్టు ఉంటుంది.
* ఒకవేళ తక్కువ ర్యాంక్ ఆటగాడితో ఒలింపిక్స్ వెళ్లేందుకు పేస్ ఇష్టపడకపోతే భూపతి, బోపన్నతో కూడిన జట్టును మాత్రమే పంపాలి.
* చివరిగా పేస్‌ను ఓ జూనియర్ ఆటగాడితో పంపి భూపతి, బోపన్నలపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలి.

లియాండర్‌పేస్‌, మహేష్‌భూపతి జోడీని లండన్‌ ఒలింపిక్స్‌కు పంపుతామని మంగళవారం అఖిల భారత టెన్నిస్‌ క్రీడాకారుల సంఘం (ఏఐటీఎం) తేల్చి చెప్పింది. తాను తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ లియాండర్‌ పేస్‌కు జోడీగా తనను ఎఐటిఎ ఎంపిక చేయడంపై భూపతి క్రీడా మంత్రిత్వశాఖకు ఒక లేఖలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రంగప్రవేశం చేయడంతో ఏఐటీఎం స్పందించింది.

ఇది ఇలా ఉంటే లియాండర్ పేస్ అఖిల భారత టెన్నిస్ సంఘానికి (ఎఐటిఎ)కి ధక్కా ఇచ్చాడు. 207/ 306 ప్రపంచ ర్యాంక్ గల క్రీడాకారుడితో జత కట్టాలని ఆదేశిస్తే తాను లండన్ ఒలింపిక్స్ క్రీడల నుంచి తప్పుకుంటానని హెచ్చరించాడు. ఈ మేరకు ఎఐటిఎకు ఆతను నోటీసు ఇచ్చాడు. మహేష్ భూపతితో గానీ రోహన్ బోపన్నతో గానీ జత కట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని అతను ఎఐటిఎ కార్యదర్శి భరత్ ఓఝాకు రాసిన లేఖలో తెలిపాడు. వేరే గత్యంతరం లేకపోవడంతో లండన్ ఒలంపిక్స్‌కు రెండు జట్లను పంపుతున్నట్లు భారత టెన్నిస్ సంఘం ఈరోజు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+