
హైదరాబాద్‌కు చెందిన 25 సంవత్సరాల వయసు కలిగిన పారుపల్లి కశ్యప్ ఈరోజు (బుధవారం) వెంబ్లీ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో తన ప్రత్యర్ది శ్రీలంకన్ నిలుక కరుణ రత్న పై విజయాన్ని సాధించాడు. మూడు గేమ్‌లలో కశ్యప్ తన ప్రత్యర్ది నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. 20 నిమిషాలు పాటు జరిగిన మొదటి గేమ్‌లో కశ్యప్ 21-14 తో విజయం సాధించాడు.
ఇక 19 నిమిషాల పాటు జరిగిన రెండవ గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగినప్పటికీ.. చివరకు 21-15 పాయింట్లతో కశ్యప్ విజయం సాధించాడు. మూడవ గేమ్‌లో కశ్యప్ అలవోకగా 21-9 పాయింట్లను సాధించి.. ప్రత్యర్ది నిలుక కరుణ రత్న పై పూర్తి స్దాయి విజయాన్ని సాధించాడు. అంతక ముండు గ్రూప్ స్టేజిలో పారుపల్లి కశ్యప్ రెండు గేమ్‌లలో గెలుపొందాడు. ఇండియన్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లల గోపీ చంద్ సారధ్యంలో పారుపల్లి కశ్యప్ సాధన చేస్తున్నాడు.
మంగళవారం జరిగిన బ్యాడ్మింటన్ గ్రూప్-డి రెండో మ్యాచ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ కశ్యప్ 21-9, 21-14తో వరల్డ్ 11 ర్యాంకర్ టియన్ మిన్హ్ ఎన్‌గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాల-దిజు జోడి ఈవెంట్ నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా