Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైనా నెహ్వాల్ హైదరాబాద్‌: మీడియా విశేషాలు

హైదరాబాద్, ఆగస్టు 7: లండన్ ఒలంపిక్స్‌లో మహిళ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు ఘన స్వాగతం లభించింది. బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సైనా రికార్డ్‌ సృష్టించడంతో ఓపెన్ టాప్ బస్‌లో హైదరాబాద్ విమానాశ్రయం నుండి గచ్చిబౌలిలో ఉన్న పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు సైనా నెహ్వాల్‌ని ఊరేగింపుగా తీసుకెళ్తుండగా చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. దీంతో సైనా ఉన్నా ఆ బస్సుని నిలిపి వేసి మరో వాహానంలో సైనాను గోపీచంద్ అకాడమీకి పంపించారు. గోపీచంద్ అకాడమీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ..

Saina Nehwal

ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని మొదటి నుండి గట్టి నమ్మకంతో ఉన్నానని.. ఐతే అది ఏ మాత్రం నాలో ఒత్తిడిని కలిగించలేదని... చాలా మంది ఆటగాళ్లలో ఒత్తిడిని తాను గమనించానని, నా వరకు మాత్రం చక్కగా రాణించానని తెలిపింది. మా తండ్రితో ఎట్టి పరిస్దితుల్లోనే పతకం లేకుండా తిరిగి రానని చెప్పానని చెప్పింది. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఏమి చెప్పాలో మాటలు రావడం లేదు. నేను పతకం గెలుస్తానని నమ్మకంతో ఉండడం, నిజంగానే పతకం గెలవడం సంతోషంగా ఉంది. నేను సాధించిన ఘనత పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నాను. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో నా దేశానికి తొలి పతకం అందించగలిగాను. ఇంత తొందరగా నా కెరీర్‌లో ఇంత పెద్ద విజయం దక్కింది.

స్వర్ణం గెలవాలని డ్రీమ్ ఉన్నప్పటికీ.. బ్యాడ్మింటన్‌లో కాంస్యం సాధించి తొలి పతకం గెలిచిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కొత్త అనుభూతిని పొందాను. లండన్ ఒలింపిక్ మెడల్‌ను మీ మెడపై ధరించడంపై మీ అనుభూతి అన్న ప్రశ్నకు గాను బయట నుండి గమనిస్తే నేను గోపీ సర్ సాధారణంగా ఉన్నప్పటికీ.. మనసులో మాత్రం ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉందని చెప్పింది. ఆట కోసం అనేక సరదాలు త్యాగం చేశాను. కానీ ఒలింపిక్ పతకం గెలవడంతో వాటన్నింటిని మరిచిపోయానంది.

ఒలింపిక్ మెడల్ చేతబూని పోడియం ముందు నుంచోవడం ఓ గొప్ప అనుభూతి. నాకు అదే జీవితం. అవును, అక్కడికి వెళ్లగానే ఒక్కసారి నా గతం గుర్తుకొచ్చింది. నాతో పాటు శ్రమించిన తల్లిదండ్రులు, వారి త్యాగాలు అన్నీ వరుసగా చుట్టుముట్టాయి. తొలి సారి బ్యాడ్మింటన్‌ను మొదలు పెట్టిన రోజునుంచి ఎంత కష్టపడ్డాను, ఎన్ని బాధలు ఓర్చుకున్నాను, అదంతా దీని కోసమే కదా అనుకోగానే ఆగకుండా కన్నీళ్లు వచ్చేశాయంది.

నా దేశం కోసం మరిన్ని పతకాలను సాధించడంలో నాకు అనునిత్యం అండదండగా నిలిచిన నా తల్లిదండ్రులు మరియు కోచ్ గోపీ సర్‌కు సర్వదా కృతజ్ఞురాలను. ఇక ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ క్రీడాకారిణి వాంగ్ ఈహాన్ గురించి మాట్లాడుతూ నేను వాంగ్ ఈహాన్‌తో ఆడని ప్రతిసారి నా వ్యూహం ఫలించడం లేదు. నెంబర్ వన్ ర్యాంకింగ్‌లో ఉన్న వాంగ్ ఈహాన్ మంచి లక్షణాలు కలిగిన అమ్మాయి. రాబోయే రోజుల్లో నేను మెరుగ్గా అడాలి.

సెమీస్‌లో ఓడాక కొంత బాధ పడినా ఇది కొత్త గేమ్ కాబట్టి వంద శాతం ప్రయత్నించాను. వాంగ్ గాయమైనా తిరిగి లేస్తుందని అనుకున్నాను. అయితే ఆమె ఏడుపు మొదలు పెట్టడంతో నేను బిత్తరపోయాను. కాలి గాయంనుంచి కోలుకోవడం అంత సులభం కాదని నాకూ తెలుసు. కాబట్టి ఆమె మళ్లీ ఆడుతుందని మాత్రం నేను అనుకోలేదు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+