
ఉత్కంఠభరితమైన పోరులో 20 ఏళ్ల భారత ఆటగాడు వికాస్ ఎర్రోల్ స్పెన్స్‌పై గత రాత్రి జరిగిన పోటీలో విజయం సాధించినట్లు ప్రకటించారు. మూడో రౌండ్‌లోనే వికాస్ 9 హోల్డింగ్ ఫౌల్స్ చేశాడని, రెఫరీ ఒక హెచ్చరిక మాత్రమే చేశాడని తన కాంపిటీషన్ జ్యూరీ సమీక్ష జరిపిన తర్వాత ఎఐబిఎ ప్రకటించింది.
స్పెన్స్‌కు తమ నిర్ధారణల అనంతరం జ్యూరీ సభ్యులు నాలుగు పాయింట్లు ఇచ్చారని, దీంతో అతను విజయం సాధించాడని ప్రకటించింది. అమెరికా బాక్సర్ అడ్డు రావడంతో రెఫరీ వికాస్ తప్పిదాన్ని గమనించలేకపోయాడని చెప్పింది.
అమెరికా ఆటగాడికి నాలుగు పాయింట్లు రావాల్సి ఉందని, దాంతో అతను విజయం సాధిస్తాడని చెప్పింది. స్పెన్స్ ఫిర్యాదుతో సమీక్ష చేపట్టి, అతన్ని విజేతగా ప్రకటించినట్లు సంఘం తెలిపింది. విజేందర్ తర్వాత వికాస్‌కు గెలుపు అవకాశాలున్నాయని ఆశించారు.