Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాక్సర్‌పై ఫంక్షన్‌లో సుతిమెత్తగా చురకలంటించిన 'సిఎం'

Bhupinder Singh Hooda
చంఢీఘడ్, ఆగస్టు 24: సన్మాన కార్యక్రంలో హార్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా భారత బాక్సర్ విజేందర్ సింగ్‌కు సుతి మెత్తగా చురకలంటిచారు. ఇక వివరాల్లోకి వెళితే లండన్

ఒలింపిక్స్‌లో పాల్గొన్న రాష్ట్ర అథ్లెట్లకు గురువారం హర్యానా పోలీసులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.

లండన్‌లో ఒలింపిక్స్‌లో పాల్గోన్న హార్యానా రాష్ట్ర పోలీసులతో పాటు ప్రక్కనే కూర్చున్న బాక్సర్ విజేందర్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 'విజేందర్ అద్భుతమైన బాక్సర్. ఇందులో

ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అతను బాక్సింగ్ వదిలి ఇతర టూర్ల కోసం సమయం వృథా చేసుకుంటున్నాడు. వీటిని తగ్గించుకుంటే ఇంకా మంచి ప్రదర్శన కనబరుస్తాడు' అని హుడా

వ్యాఖ్యానించారు.

గతంలో విజేందర్ చేసిన మోడలింగ్, టెలి విజన్ షోలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది. బయటి వ్యవహారాలకు సమయం తగ్గించి ఆటపై

దృష్టిపెట్టాలన్నారు. ఐతే ముఖ్యమంత్రి స్నేహపూరితంగా అలా మాట్లాడాడని బాక్సర్ విజేందర్ తేలికగా తీసుకున్నాడు. ఈ కార్యక్రమంలో జై భగవాన్, సీమా అంటిల్‌లను హార్యానా

ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోట్ చేశారు.

లండన్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ యోగేశ్వర్‌కు రూ.51 లక్షలు, ఇతర ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.11 లక్షల చొప్పున నగదు ప్రోత్సహాన్ని అందజేశారు.
భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలవగా.. ఇటీవల జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో వెనుదిరిగిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+