Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్క గోల్‌తో టోర్నీ నుండి నిష్క్రమించిన రష్యా

Greece reach last eight as Russia exit Euro 2012
వార్సా, జూన్ 18: యూరో కప్‌లో హోరాహోరీగా సాగిన గ్రూప్-ఎ లీగ్ సమరం ముగిసింది. నాకౌట్ రేసులో మిగిలే జట్లు ఏవనే ఉత్కంఠకు తెరపడింది. ఈ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెక్ రిపబ్లిక్ (6), గ్రీస్ (4) క్వార్టర్స్ బెర్తులు సొంతం చేసుకున్నాయి. కాగా ఇదే గ్రూప్‌లోని రష్యా (4), ఆతిథ్య పోలెండ్ (2) టోర్నీ నుంచి నిష్క్రమించాయి. రష్యా, గ్రీస్ సమాన పాయింట్లు సాధించినప్పటికీ ముఖాముఖి పోరులో 1-0 రికార్డు ఉన్న గ్రీస్ అర్హత సంపాదించింది. శనివారం రాత్రి జరిగిన చివరి లీగ్‌లో ఒకే ఒక్క గోల్‌తో అటు గ్రూప్ ఫేవరెట్ రష్యాను ఇంటికి పంపడంతో పాటు తాము నాకౌట్‌కు అర్హత సాధించారు.

విరామానికి రెండు నిమిషాల ముందు గ్రీస్ ఆటగాడు కరగోనిస్ ఏకైక గోల్ నమోదు చేశాడు. ద్వితీయార్ధంలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో గ్రీస్ విజయం పరిపూర్ణమైంది. ఈ మ్యాచ్ తిలకించేందుకు నాలుగువేల మంది గ్రీస్ అభిమానులు విచ్చేయగా, రష్యా అభిమానులు భారీ సంఖ్యంలో 20 వేల మంది తరలివచ్చారు. రష్యా ఓటమితో వారు నిరాశతో వెనుదిరిగారు. లీగ్ దశలో గ్రీస్ ఒక్కో విజయం, డ్రా, ఓటమి నమోదు చేసింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

ఈ గ్రూప్‌లో అత్యధిక పాయింట్ల (4)తో బరిలోకి దిగిన రష్యా ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్ చేరుకునేది. కానీ పేలవ ఆటతీరుతో భారీ మూల్యం చెల్లించుకుంది. గ్రీస్ ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక డ్రా, ఒక ఓటమితో ఉంది. చివరి లీగ్ మ్యాచ్‌లో రష్యాపై గెలుపే ఈ జట్టుకు అదృష్టంగా మారింది. అయితే రష్యన్ బాక్స్‌లోకి డైవ్ చేసినందుకు కరాగునిస్ బుక్ కావడంతో క్వార్టర్స్‌కు దూరం కానున్నాడు.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు

రాత్రి 12.15 గంటలకు ఇటలీ వర్సెస్ ఐర్లాండ్, నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు నుంచి స్పెయిన్ వర్సెస్ క్రొయేషియా, నియో ప్రెమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+