
తనను పెళ్లి చేసుకుంటానని పింకీ ప్రామాణిక్ వాగ్దానం చేసి, ఆ తర్వాత నిరాకరించిట్లు ఆ మహిళ తెలిపింది. ఆ మహిళ నార్త్ 24 పరగణా జిల్లాలోని బాగుహతీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తీసుకుని వెళ్లారు. మహిళా చెప్పుకుంటున్న పింకీ ప్రామాణిక్ వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన వెంటనే కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రామాణిక్ ఖాతర్‌లోని దోహాలో జరిగిన 2006 ఆసియా క్రీడల్లో 4X400 మీటర్లలో రిలేలో స్వర్ణపతకాన్ని సాధించింది. అదే ఏడాది జరిగిన మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.