భారత రక్షణ పంక్తిలోని లోపాలను సొమ్ముచేసుకున్న జర్మన్ స్ట్రయికర్ ఫ్లోరియన్ ఫ్లచ్స్ హ్యాట్రిక్ (7, 16, 36 నిమిషాల్లో) గోల్స్‌తో చెలరేగగా, ఒలీవర్ కోర్న్ (24వ), క్రిస్టఫర్ వాస్లే (33వ) చెరో గోల్‌తో జర్మనీకి అద్భుత విజయాన్నందించారు. భారత్ తరఫున రఘునాథ్ (13వ), తుషార్ ఖండేకర్ (62వ) చేసిన గోల్స్ ఓటమి అంతరాన్ని తగ్గించగలిగాయి.
భారత్ ఖాతాలో మరో పత కం చేరే అవకాశం త్రుటిలో తప్పిపోయింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఏ మాత్రం అంచనాల్లేకుండా బ రిలోకి దిగిన జాయ్దీప్ కర్మాకర్ 1.9 పా యింట్ల తేడాతో కాంస్యం చేజార్చుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 595 పాయింట్లతో ఫైనల్‌కు చేరిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో సాధించిన 104.1 పాయింట్లతో కలిపి మొత్తం 699.1 పాయింట్లతో నిలిచిన కర్మాకర్ మూడోస్థానానికి (701.0) కొద్దిదూరంలో ఆగిపోయాడు.
ఇదే ఈవెంట్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన హైదరాబాదీ గగన్ నారంగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 593 పాయింట్లు మాత్రమే సాధించి 18వ స్థానానికి పరిమితమయ్యాడు.
అథ్లెటిక్స్‌లో భారత ప్రస్థానం నిరాశతో మొదలైంది. షాట్‌పుట్‌లో ఓమ్ ప్రకాష్ సింగ్, ట్రిపుల్ జంప్‌లో మయూఖా జానీ ఫైనల్స్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. భారత్ తరఫున బరిలోకి దిగిన ఏకైక స్విమ్మర్ గగన్ ఉలాల్మత్ (1500 మీటర్ల ఫ్రీస్టయిల్) హీట్స్‌లోనే వెనుదిరిగాడు.