Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వచ్చే ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధిస్తా: గగన్ నారంగ్

Gagan Narang
హైదరాబాద్: వచ్చే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకం సాధిస్తానని ఒలింపిక్ కాంస్య పతక విజేత హైదరాబాదీ గగన్ నారంగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆయనకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనను పూలతో అలంకరించిన ఓపెన్ టాప్ జీపులో ఊరేగించారు. ఆయన సచివాలయంలో క్రీడల శాఖ మంత్రి వట్టి వసంత్ కుమార్‌ను కలిశారు.

లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడం తన అదృష్టమని, అందుకు తాను చాలా సంతోషిస్తున్నానని ఆయన చెప్పారు. తాను పతకం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

అంతర్జాతీయంగా విజయాలు సాధించడానికి ప్రభుత్వం క్రీడాకారులకు మరిన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాల్సి ఉందని ఆయన అన్నారు. లండన్ ఒలింపిక్స్‌లో ఆయన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగు విభాగంలో కాంస్యపతకం సాధించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు శాప్ అధికారులు, యువ షూటర్లు ఘన స్వాగతం పలికారు.

విజయ్ కుమార్, గగన్ నారంగ్‌లకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏఐ) నజరానాను ప్రకటించింది. రజతం సాధించిన విజయ్‌కు రూ.25 లక్షలు, కాంస్యం గెలుచుకున్న గగన్‌ నారంగ్‌కు రూ.15 లక్షలు అందిస్తామని ఇప్పటికే తెలిపింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు వన్నె తెచ్చిన హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్‌కి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు నజరానా ప్రకటించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+