Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

43 యేళ్ల తర్వాత ఫ్రాన్స్‌పై విజయం సాధించిన స్వీడన్

France through but only after Swedish lesson
డొనెట్‌స్క్, జూన్ 21‌: యూరో 2012 టోర్నమెంట్లో నిన్నటితో లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో క్వార్టర్స్ ఫైనల్స్‌కు తెర లేచింది. రాత్రి 12.15 గంటలకు నుంచి చెక్ రిపబ్లిక్ వర్సెస్ పోర్చుగల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో క్వార్టర్ ఫైనల్స్ మొదలవుతాయి. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసి నాకౌట్ రేసు నుంచి వైదొలిగిన స్వీడన్ (3 పాయింట్లు) ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ 2-0తో విజయం సాధించింది. కానీ గ్రూప్‌-డిలో ఫ్రాన్స్‌ టాప్‌-2లో ఉండడంతో క్వార్టర్స్‌ ఫైనల్‌కు చేరింది. స్వీడన్‌ అద్బుత విజయంతో యూరో కప్‌ నుంచి ఇంటిదారి పట్టింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

స్వీడన్‌ కెప్టెన్‌ జాల్టన్‌ ఇబ్రహిమోవిక్‌ 54 నిమిషంలో జట్టుకు తొలి గోల్‌ అందించాడు. చివరి నిమిషంలో సెబాస్టియన్‌ లార్సన్‌ గోల్స్‌ చేసి జట్టును 2-0 ఆధిక్యంలో నిలిపాడు. స్వీడన్‌ 43 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్‌పై విజయం సాధించడం విశేషం. అక్టోబర్‌ 1969లో ఫ్రాన్స్‌ను స్వీడన్‌ చివరి సారి ఓడించింది. 2006 ప్రపంచ కప్‌ తర్వాత ఫ్రాన్స్‌ మేజర్‌ టోర్నీలలో నాకౌట్‌ దశను దాటటం ఇదే తొలిసారి.

ఫ్రాన్స్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓ విజయం, డ్రా నమోదు చేయడంతో పాటు ఉక్రెయిన్‌ను ఇంగ్లండ్ చిత్తుచేయడంతో ఆ జట్టుకు మార్గం సుగమమైంది. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంఫియన్ స్పెయిన్‌తో తలపడనుంది.

ఈరోజు జరుగు మ్యాచ్‌ నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు నుంచి చెక్ రిపబ్లిక్ వర్సెస్ పోర్చుగల్ (Q1)

వేదిక: వార్సా

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+