Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుసగా 15వ గెలుపు, సెమీఫైనల్లో జర్మనీ

Four-star Germans blast Greeks to reach Euro semis
జిడాన్స్క్ (పోలండ్), జూన్ 24: చక్కని ఆటతీరుని కనబర్చిన జర్మనీ 'యూరో కప్' ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ 4-2 గోల్స్ తేడాతో గ్రీస్‌పై జయభేరి మోగించింది. జర్మనీ తరఫున ఫిలిప్ లామ్, ఖెడిరా, మిరోస్లావ్ క్లోజ్, రెయుస్ ఒక్కో గోల్ చేశారు. గ్రీస్ జట్టుకు సమరాస్, సాల్పింగిడిస్ ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్, ఇటలీల మధ్య జరిగే చివరి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో వచ్చే గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో జర్మనీ జట్టు తలపడుతంది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

ప్రస్తుత యూరో-2012 టోర్నమెంట్లో జర్మనీకిది వరుసగా నాలుగో విజయం కాగా ఓవరాల్‌గా చూస్తే 15వ గెలుపు. 2010 ప్రపంచ కప్ ఫైనల్లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వేపై మొదలైన జర్మనీ విజయపరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అత్యధికంగా 19 వరుస విజయాల ప్రపంచ రికార్డు... డిఫెండింగ్ ప్రపంచ, యూరో చాంపియన్ స్పెయిన్ పేరిట ఉంది. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలంటే... జర్మనీ ప్రస్తుత యూరో టోర్నీలో టైటిల్ సాధించడంతోపాటు త్వరలో మొదలయ్యే 2014 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఫారో ఐలాండ్, ఆస్ట్రియా, ఐర్లాండ్ జట్లతో జరిగే తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందాలి.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

తొలి అర్ధ భాగం నుంచి జర్మనీ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. గోల్స్‌ కోసం ఇరు జట్లు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. 39వ నిమిషంలో ఫిలిప్‌ లామ్‌ లాంగ్‌ రేంజ్‌ నుంచి గోల్‌కొట్టాడు. రెండో అర్ధ భాగంలో గ్రీస్‌ ఆటగాడు జార్జీయస్‌ సమరాస్‌ గోల్‌ చేసి స్కోరు 1-1తో సమం చేశాడు. 55 నిమిషం వరకు రెండు జట్టు హోరా హోరి పోరాడాయి. కానీ ఆట చివర్లో జర్మనీ ఆటగాళ్లు వీరవిహారం చేశారు. గ్రీస్‌ రక్షణ శ్రేణిని ఛేదించుకుని గోల్స్‌ వర్షం కురిపించారు. 69వ నిమిషంలో జర్మనీ ఆటగాడు సమీ ఖెదిర గోల్‌పోస్టుకు అతి దగ్గర నుంచి గోల్‌ చేసి జట్టు ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. 7 నిమిషాల తర్వాత మిర్‌స్లోవ్‌ కోల్సే (జర్మనీ) మరో గోల్‌ చేశాడు. దీంతో జర్మనీ 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆట 15 నిమిషాల్లో ముగుస్తుందనగా జర్మనీ ఆటగాడు మిడ్‌ఫీల్డర్‌ మార్కో రియాస్‌ అద్భుతమైన గోల్‌ కొట్టాడు.

ఈరోజు జరుగు మ్యాచ్‌: నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు నుంచి ఇంగ్లండ్ వర్సెస్ ఇటలీ(క్వార్టర్ ఫైనల్-4)

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+