Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహిళ కాదు పురుషుడే: పింకీపై రేప్ కేసు నమోదు

 Pinki Pramanik
న్యూఢిల్లీ: కామన్‌వెల్త్ క్రీడల్లో మహిళా విభాగంలో పతకం సాధించిన పింకీ ప్రామాణిక్ మహిళ కాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో పింకీపై కోల్‌కత్తా పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పింకీపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. రేప్ ఆరోపణపై పింకీని పోలీసులు జూన్ 14వ తేదీన అరెస్టు చేశారు.

ఆసియా కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన అథ్లెట్ పింకీ ప్రామాణిక్‌ అప్పటి నుంచి కష్టాల్లో పడ్డాడు. పింకీ ప్రామాణిక్ పురుషుడని, ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పింకీ ప్రామాణిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై పింకీ ప్రామాణిక్ అత్యాచారానికి పాల్పడినట్లు పింకీతో సహజీవనం చేసిన 30 ఏల్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తనను పెళ్లి చేసుకుంటానని పింకీ ప్రామాణిక్ వాగ్దానం చేసి, ఆ తర్వాత నిరాకరించిట్లు ఆ మహిళ తెలిపింది. ఆ మహిళ నార్త్ 24 పరగణా జిల్లాలోని బాగుహతీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో వైద్య పరీక్షల కోసం ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌కు తీసుకుని వెళ్లారు.

ప్రామాణిక్ ఖాతర్‌లోని దోహాలో జరిగిన 2006 ఆసియా క్రీడల్లో 4X400 మీటర్లలో రిలేలో స్వర్ణపతకాన్ని సాధించింది. అదే ఏడాది జరిగిన మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.

క్రీడల స్వర్ణ పతక విజేత పింకీ ప్రామాణిక్ తిరిగి రైల్వే శాఖలోని తన ఉద్యోగంలో చేరింది. తనతో సహజీవనం చేసి రేప్ చేసినట్లు, పింకీ ప్రామాణిక్ మహిళ కాదనీ పురుషుడనీ ఆరోపణలు ఎదుర్కున్నారు. దాంతో ఆమె సస్పెన్షన్‌కు గురైంది. ఆ సస్పెన్షన్‌ను ఎత్తేయడంతో తిరిగి ఆమె తూర్పు రైల్వేలోని సీల్దాహ్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కలెక్టర్‌గా చేరారు. తిరిగి పింకీ ఉద్యోగానికి ఎసరు వచ్చినట్లే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+