
దీంతో 1988 సియోల్ ఒలింపిక్స్ తర్వాత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి దేశంగా చైనా గుర్తింపు పొందింది. యీ సిలింగ్, యూ డాన్ ధాటికి బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన కాటరీనా ఎమ్మన్స్ (చెక్ రిపబ్లిక్) 500.3 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో జిన్ జాంగో (దక్షిణ కొరియా) స్వర్ణ పతకాన్ని సాధించాడు. అతను 688.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లూకా టెస్కాని (ఇటలీ-685.8 పాయింట్లు) రజతం, ఆంద్రియా జ్లాటిక్ (సెర్బియా-685.2 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ పాంగ్ వీ(చైనా) నాలుగో స్థానంతో సంతృప్తి పడ్డాడు.
తెలుగు వన్ఇండియా