Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సత్తా చాటిన ఇటలీ, ఇంటి దారి పట్టిన జర్మనీ

వార్సా, జూన్ 29: యూరో టోర్నీలో సెమీ ఫైనల్స్ అంకం ముగిసింది. దీంతో సెమీ ఫైనల్స్-1లో పోర్చుగల్ ఇంటికి వెళితే, సెమీ ఫైనల్స్-2లో జర్మనీ ఇంటి దారి పట్టింది.
సెమీ ఫైనల్-1లో ఇటలీతో ఏక పక్షంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ 1-2 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. టోర్నీ ఆద్యంతం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆడిన ఇటలీ ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఏవిధంగానైతే ఓడించిందో అదే ఊపును ఇటలీ సెమీ ఫైనల్‌లో కూడా కనబర్చి జర్మనీపై ఇటలీ విజయం సాధించింది.

Euro 2012: Stats and Facts: Germany vs Italy

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

జర్మనీపై ఇటలీకి అత్యతద్బుతమైన రికార్డు ఉంది. ప్రపంచ కప్‌, యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఎనిమిది సార్లు ఇటలీ చేతిలో జర్మనీ ఓడింది. ఈ రికార్డును అలాగే కొనసాగించింది. ఇక 16 ఏళ్లుగా జర్మనీ ఓ మేజర్ అంతర్జాతీయ టోర్నీని గెలిచింది లేదు. 1996లో యూరో కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడా లోటును తీర్చుకోవడంతోపాటు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో ఇటలీ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉన్నప్పటికీ ఆ కసిని ప్రదర్శించలేక పోయింది. ప్రపంచకప్ లేక యూరో కప్ ఫైనల్స్‌లో ఇరు జట్లు తలపడడం ఇది ఎనిమిదోసారి.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

యూరో ఛాంపియన్‌లో ఒకటిగా బరిలోకి దిగిన జర్మనీకి ఇటలీ ఆటగాడు బలోటెల్లి షాకిచ్చాడు. వరుసగా రెండు గోల్స్ చేసిన టెల్లి ఇటలీని తొలి అర్థభాగంలోనే ఆధిక్యంగా దిశగా నడిపించాడు. చివరి వరకూ పోరాడిన జర్మనీ నిర్ణీత సమయానికి ఒక్క గోల్ మాత్రమే చేయడంతో ఓటమి భారంతో వెనుదిరిగింది. దీంతో ఇటలీ ఫైనల్లో స్పెయిన్‌తో పోరుకు సిద్ధమైంది.

యూరో 2012: ఫైనల్

జులై 1: స్పెయిన్ వర్సెస్ ఇటలీ

నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+