For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యూరో సెమీ ఫైనల్: పోర్చుగల్ వర్సెస్ స్పెయిన్

By Nageswara Rao
Euro 2012: Semi-Final Preview: Portugal vs Spain
డోనెటెస్క్, జూన్ 27: యూరో టోర్నమెంట్లో క్వార్టర్స్ ఫైనల్స్ ముగిసే సరికి సెమీ ఫైనల్స్ లోకి నాలుగు జట్లు వచ్చాయి. అవే పోర్చుగల్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ. ఈరోజు డోనెటెస్క్ లో ఉన్న డాన్ బాస్ ఎరినాలో జరగనున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్, స్పెయిన్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఢిఫెండిగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న స్పెయిన్ ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ ను ఎదుర్కొంటుంది. లీగ్ దశ నుండి ఇప్పటి వరకు పోర్చుగల్ మూడు వరుస విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. 1970 తర్వాత ఏ యూరోపియన్ జట్టు కూడా వరుసగా మూడు పెద్ద టోర్నీల్లో ఫైనల్‌కు చేరలేదు. డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచకప్ విజేత స్పెయిన్ ఒక్క విజయం సాధిస్తే ఈ రికార్డును చేరుతుంది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స

ఐతే సెమీ ఫైనల్‌‌లో ఎప్పుడూ ఓటమి ఎరుగని రికార్డు స్పెయిన్‌కు ఉంది. మరోవైపు పోర్చుగల్ కూడా టోర్నీలో మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ ఐదుసార్లు అతి పెద్ద టోర్నమెంట్‌‌లలో సెమీ ఫైనల్స్ ఆడిన పోర్చుగల్ కేవలం ఒక్క సందర్భంలోనే గెలిచింది. దీంతో పోర్చుగల్‌కు ఈ రికార్డుని సైతం తుడిచివేసి టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

పోర్చుగల్ జట్టు ఎప్పటిలాగే ఈ టోర్నీలో కూడా క్రిస్టియానో రొనాల్డోపైనే ఎక్కువగా ఆధారపడింది. నాని ఇప్పటివరకూ గోల్స్ చేయకపోయినా కీలక సమయంలో రాణించే సత్తా ఉన్న ఆటగాడు. 2004 ఫైనల్లో గ్రీస్ చేతిలో ఓటమి తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరే అవకాశం వచ్చింది. ఈసారి దీన్ని వదలకూడదనే కసి ఆటగాళ్లలో ఉంది. గత ప్రపంచకప్‌లోనూ స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ప్రిక్వార్టర్స్‌లో ఓడింది.

వరుసగా 18 మ్యాచ్‌ల నుంచి ఓటమి ఎరుగని రికార్డుతో ఉన్న స్పెయిన్... ఈ టోర్నీ ఆరంభం నుంచి అంచనాలకు తగ్గట్లుగానే ఆడుతోంది. జట్టులోకి కీలక ఆటగాళ్లంతా సమష్టిగా కదులుతున్నారు. ఫార్వర్డ్ ఫెర్నాండో టోరెస్ (2), మిడ్‌ఫీల్డర్లు ఫాబ్రిగాస్ (2), జేబి అలోన్సో (2) మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే టోర్నీలో పోర్చుగల్ డిఫెన్స్ విభాగం ఆకట్టుకుంది.

జట్టులో కీలక ఆటగాళ్లు:

పోర్చుగల్: రుయి పాట్రికో పెరిరా, పేపే, అల్వెస్, కోయిన్‌ట్రో, ముతిన్హో, వెలోసో, మెరిలెస్, నాని, ఒలివేర, రోనాల్డో

స్పెయిన్: పిక్యూ క్యాసిలాస్, ఆర్బిలోయా, రామోస్,, బుస్క్యూట్స్-ఆల్బా, అలోన్సో-సిల్వా, ఎక్సావి ఇనిఎస్త, టోర్రెస్

యూరో కప్ తొలి సెమీఫైనల్

నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు నుంచి పోర్చుగల్ వర్సెస్ స్ఫెయిన్

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+