
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
మూడు సార్లు యూరోపియన్ ఛాంపియన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న జర్మనీ, పలుమార్లు రన్నరప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. అంతేకాకుండా మూడు సార్లు పుట్‌బాల్ ప్రపంచ కప్‌ను కూడా గెలుచుకుంది. 12 సార్లు యూరో టోర్నమెంట్లో తొలి నాలుగు స్దానాల్లో నిలిచింది. ఇక గ్రీస్ విషయానికి వస్తే ఒకే ఒక్కసారి యూరో కప్ గెలిస్తే, రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్ ఆడింది.
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
గ్రీస్ జట్టు
ఢిఫెన్స్‌లో బలంగా ఉంటే, జర్మనీ అత్తుత్తమ ప్రదర్శనను కనబర్చింది. గ్రీస్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లలో కేవలం ఐదు గోల్స్ మాత్రమే ప్రత్యర్ది జట్టుకు ఇచ్చింది. ఈరోజు రాత్రి 12.15 గంటలకు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపద్యంలో జర్మనీ మిడ్ ఫీల్డర్ సమి ఖేదికా మాట్లాడుతూ గ్రీస్ మంచి జట్టు, వ్యూహాల పరంగా చాలా బలమైంది. దూకుడుగా ఆడుతుంది. కాబట్టి మేము కూడా అందుకు తగ్గ వ్యూహాలను పన్నాలని అన్నాడు.
ఈరోజు జరుగు మ్యాచ్: నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 12.15 గంటలకు నుంచి గ్రీస్ వర్సెస్ జర్మనీ (Q2)
తెలుగు వన్ఇండియా