For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'వేనీ రూనీ' మ్యాజిగ్ గోల్‌తో ఇంగ్లండ్ క్వార్టర్స్‌లోకి..

By Nageswara Rao
Euro 2012: Lucky England stumble into quarter-finals
డొనెట్‌స్క్, జూన్ 21‌: యూరో కప్‌లో లీగ్ సమరం ముగిసింది. ఈరోజు నుండి చెక్ రిపబ్లిక్ వర్సెస్ పోర్చుగల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో నాకౌట్ పోరుకు సిద్దమైంది. గ్రూప్‌-డిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 1-0 తేడాతో ఉక్రెయిన్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకొంది. గ్రూప్-డిలో ఇంగ్లండ్ 7 పాయింట్లు, ఫ్రాన్స్ 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ని లిచి క్వార్టర్స్ బెర్తులు దక్కించుకున్నాయి. పాయింట్ల పట్టికలో ఉక్రెయిన్ (3) మూడో స్థానానికి పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

ఆట ప్రథమార్ధంలో ఇంగ్లండ్, ఉక్రెయిన్ బోణీ కొట్టలేకపోయాయి. 48వ నిమిషంలో ఇంగ్లండ్ స్టార్ స్ట్రయికర్ వేనీ రూనీ ఏకైక గోల్ నమోదు చేసి జట్టును నాకౌట్‌కు చేర్చాడు. ఉక్రేయిన్‌కు మ్యాచ్‌ డ్రా చేసుకునే అవకాశం వచ్చింది. కానీ వివాదాస్పద గోల్‌తో ఆ అవకాశం చేజారింది. ఉక్రేయిన్‌ ఆటగాడు మార్కో డేవిక్‌ 62 నిమిషంలో గోల్‌ చేశాడు. కానీ అది వివాదంగా మారింది. అంపైర్‌ దాన్ని తప్పుగోల్‌గా ప్రకటించాడు. టివి రిప్లైలో బంతి గోల్‌ లైన్‌కి కొంచె అవతలగా వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌ జట్టు గ్రూప్‌-సి రన్నరప్‌ ఇటలీతో తలపడనుంది. మరోవైపు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆతిథ్య జట్లలో ఒకటైన ఉక్రెయిన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో గ్రూప్ డి నుండి యూరో కప్‌లో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ జట్లు క్వార్టర్స్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఉక్రెయిన్‌ కెప్టెన్‌ ఆండ్రై ష్కెవ్‌చెంకో గాయపడడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ఈరోజు జరుగు మ్యాచ్‌: నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 12.15 గంటలకు నుంచి చెక్ రిపబ్లిక్ వర్సెస్ పోర్చుగల్ (Q1)

వేదిక: వార్సా

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+