Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇటలీని చూసి జర్మనీ భయపడుతుంది: ఆండ్రియా పిర్లో

Euro 2012: Germany are afraid of Italy, says Pirlo
వార్సా, జూన్ 28: యూరో టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్ కూడా రంజు మీద సాగుతున్నాయి. వరుస విజయాలతో ఉన్న జర్మనీ, ప్రతి మ్యాచ్ ఫైనల్‌గా భావించిన ఇటలీ ఈ రెండింటి మధ్య ఈరోజు సెమీ ఫైనల్ రెండవ మ్యాచ్ జరగనుంది. ఎరకంగా చూసిన ఇటలీపై జర్మనీ అవలీలగా గెలుస్తుందని అభిమానులు భావిస్తున్నప్పటికీ... ఒక్క జర్మనీపై ఇటలీకి అత్యతద్బుతమైన రికార్డు ఉంది. గతంలో జరిగిన పెద్ది టోర్నీలలో జర్మనీపై ఇటలీదే పైచేయిగా సాగింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్

ప్రపంచ కప్‌, యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో ఎనిమిది సార్లు ఇటలీ చేతిలో జర్మనీ ఓడింది. ఈ రికార్డును అలాగే కొనసాగించాలని ఆ జట్టు తహతహలాడుతోంది. ఇక 16 ఏళ్లుగా జర్మనీ ఓ మేజర్ అంతర్జాతీయ టోర్నీని గెలిచింది లేదు. 1996లో యూరో కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడా లోటును తీర్చుకోవడంతోపాటు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో ఇటలీ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ప్రపంచకప్ లేక యూరో కప్ ఫైనల్స్‌లో ఇరు జట్లు తలపడడం ఇది ఎనిమిదోసారి.

యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు

జర్మనీ స్టార్‌ ఆటగాడు బయేర్స్‌ మూనిచ్‌ మ్యాచ్‌కు సిద్ధమని కోచ్‌ లోవె తెలిపాడు. అతడి చీలమండల గాయంతో సమస్య లేదన్నాడు. మూనిచ్‌ గ్రీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కొన్ని పాస్‌లను గోల్స్‌గా మలచడంతో ఇబ్బంది పడ్డాడు. కానీ గ్రూప్‌ దశలో హాలాండ్‌పై 2 గోల్స్‌ చేసి జట్టును గెలింపించాడు. నేటి మ్యాచ్‌లో జర్మనీ తరుపున రియల్‌ మ్యాడ్రిడ్‌ మిడ్‌ఫీల్డర్‌ సమి ఖెదిర, మెసుట్‌ ఓజిల్‌, బరోసియా డోర్ట్‌ముడ్‌, డిఫెండర్‌ మ్యాట్స్‌ హ్యుమెల్స్‌ , బయేర్న్‌ మునిచ్‌, కీపర్‌ మ్యానుయెల్‌ నెయ్యుర్‌ బరిలోకి దిగనున్నారు. లీగ్ స్థాయిలో రాణించిన జర్మనీ ఆటగాళ్లు సెమీస్‌ విజయంపై ఆశపెట్టుకున్నారు.

గత ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిన జర్మనీ అనంతరం వరుసగా 15 మ్యాచ్‌ల్లో అపజయమనేది లేకుండా ఆడుతోంది. మూడు సార్లు యూరో టైటిల్‌ను సాధించిన జర్మనీ ఇదే జోరును సెమీస్‌లోనూ కొనసాగించి ఇటలీపై తమ పేలవ రికార్డును తుడిచిపెట్టేయాలని భావిస్తోంది. టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ జర్మనీ స్పష్టమైన విజయాలు సాధించగా ఇటలీ ఐర్లాండ్‌పై, క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై షూటవుట్‌లో మాత్రమే నెగ్గింది.

యూరో 2012: సెమీ ఫైనల్ - 2

జూన్ 28: జర్మనీ వర్సెస్ ఇటలీ

నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+