కీవ్, జులై 1: యూరో కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్... మాజీ విజేత ఇటలీ ఆదివారం జరిగే అంతిమ సమరంలో తలపడనున్నాయి. ఇరు జట్ల బలాబలాల దృష్ట్యా ఈ పోరులో హోరాహోరీ తప్పదు. రెండో సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ అయిన జర్మనీపై గెలిచిన ఇటలీ ఈ సారి ఎలాగైనా సరే టైటిల్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
1968లో యూరో కప్ నెగ్గిన ఇటలీ సుమారు నాలుగున్నర దశాబ్ధాల తర్వాత ఫైనల్ లోకి ప్రవేశించింది. 2000లో జరిగిన 'యూరో' ఫైనల్లో అదనపు సమయంలో ఫ్రాన్స్ చేతిలో టైటిల్‌ను కోల్పోయిన ఇటలీ ఈసారి పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. మరియా బలోటెలి సూపర్ షోపైనే ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీలో మ్యాచ్ మ్యాచ్‌కి ప్రమాదకర ఆటగాడిగా రాటుదేలిన ఈ స్టార్ స్ట్రయికర్ మరో మ్యాజిక్ చేస్తే జట్టు ఆశ తీరుతుంది.
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ చాంపియన్ స్పెయిన్ వరుసగా రెండో సారి 'యూరో'ను సాకారం చేసుకునేందుకు తహతహలాడుతోంది. ఈ సారీ టైటిల్ సాధించి... వరుసగా మూడు మేటి టోర్నీల్లో విజేతగా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. క్వార్టర్ ఫైనల్లో 2-0తో ఫ్రాన్స్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచిన స్పెయిన్... సెమీఫైనల్లో షూటౌట్‌తో పోర్చుగల్‌ను కంగుతినిపించిన విషయం తెలిసిందే.
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
ఇటలీ స్టార్ ఆటగాడు ఫెర్నాండో టోరెస్ అటాకింగ్‌పై స్పెయిన్ నమ్మకం పెట్టుకుంది. ఫైనల్లోనూ అతను ముందుండి నడిపిస్తే ఇటలీకి కష్టాలు తప్పవు. బలోటెలిని ఎక్కడికక్కడ స్పెయిన్ డిఫెండర్లు కట్టడి చేస్తేనే స్పెయిన్ చరిత్ర సృష్టించగలుగుతుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు స్పెయిన్, ఇటలీ 30 మ్యాచ్‌ల్లో తలపడా.. ఇటలీ 10 మ్యాచ్‌ల్లో, స్పెయిన్ 8 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 12 మ్యాచ్‌లు 'డ్రా' అయ్యాయి.
యూరో 2012 ఫైనల్
రాత్రి 12.15 గంటలకు నుంచి ఇటలీ వర్సెస్ స్పెయిన్
నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
తెలుగు వన్ఇండియా