Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

130 కోట్ల డ్రగ్స్ పట్టివేత: ...బాక్సర్ విజేందర్ భార్య కారు

Vijender Singh
మొహాలీ: పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబట్టాయి. మొహాలీ జిల్లాలోని జిరక్‌పూర్‌లోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు రూ.130 కోట్ల విలువైన 16 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే, ఈ హెరాయిన్‌కు భారత స్టార్ బాక్సింగ్ ఛాంపియన్ విజేందర్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారిస్తున్నారు.

హెరాయిన్ దొరికిన స్థలంలో విజేందర్ సింగ్ భార్య కారు ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే హెరాయిన్ దొరికిన కారు విజేందర్ సింగ్ సతీమణిదా కాదా తెలియాల్సి ఉంది. హెరాయిన్ దొరికింది మరోకారులో అని కూడా చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన ఓ నిందితుడికి విజేందర్ సింగ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. నిందితుడు అనూప్ సింగ్.. తాను పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు చెప్పినట్లుగా చెబుతున్నారు. అందులో విజేందర్ ఉన్నారని చెబుతున్నారు.

ఓ ప్లాటు నుండి తాము ఇరవై ఆరు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పతేఘడ్ సాహెబ్ పోలీసు ఉన్నతాధికారు హరిదయాళ్ గురువారం వెల్లడించారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో నూటా ముప్పై కోట్ల రూపాయలు ఉంటుందన్నాడు. నిందితుడు అనుప్‌ను కోర్టులో హాజరుపర్చారు. అతనికి కోర్టు నాలుగు రోజుల పాటు రిమాండు విధించింది.

కెనడా, అమెరికా తదితర దేశాలకు డ్రగ్స్‌ను అక్రమంగా తరలించినట్లు అనుప్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 3వ తేదిన పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఇది బయటపడింది. మరోవైపు దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజేందర్ సింగ్ చెప్పుకొచ్చారు.

విజేందర్ సింగ్‌కు సంబంధం లేదు

డ్రగ్స్ డీలర్‌తో విజేందర్ సింగ్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడి కాలేదని పోలీసులు చెప్పారు. నిందితుడితో విజేందర్‌కు సంబంధాలు లేవని చెప్పారు. విజేందర్ కారుకు కొద్ది దూరంలో తాము దానిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+