
దీంతో హాట్‌షాట్స్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెటరన్ తౌఫిక్ హిదాయత్ గేమ్ ఉండడంతో హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం ఖాయమనిపించింది. ఐతే క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ తర్వాతి మూడు మ్యాచ్‌ల్నీ నెగ్గడంతో పరిస్థితి తలకిందులైంది. ఇది హైదరాబాద్‌కు తొలి ఓటమి.
తొలి రెండు మ్యాచుల్లో ఓడి 2-0తో వెనుకబడ్డ ఢిల్లీ.. అద్భుతంగా పుంజుకుంది. వరుసగా మూడు మ్యాచులలో గెలిచి హైదరాబాదుకు తొలి పరాజయాన్ని రుచి చూపించింది. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్‌లో టనోగ్సక్.. సాయిప్రణీత్ (ఢిల్లీ)ను ఓడించి హైదరాబాద్‌కు 1-0 ఆధిక్యం అందించాడు.
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (హైదరాబాద్) అరుంధతిపై (ఢిల్లీ) అలవోక విజయం సాధించింది. దీంతో హాట్‌షాట్స్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా పురుషుల డబుల్స్‌లో హోంగ్ టన్/కీన్ కీట్ హైదరాబాద్ జోడీ షెమ్ ఘో/తరుణ్ కోనను ఓడించి ఢిల్లీ విజయావకాశాలను సజీవంగా ఉంచారు.
పురుషుల సింగిల్స్‌లో ఢిల్లీ ఆటగాడు డారెన్ లీ... తౌఫిక్ హిదాయత్‌పై (హాట్‌షాట్స్)పై ఘన విజయం సాధించాడు. ఢిల్లీ, హైదరాబాద్ మ్యాచ్ 2-2తో సమమైంది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్‌లో ఢిల్లీ జోడీ దిజు/ప్రజక్తా జోడీ... షెమ్ హో/ప్రద్న్య గాద్రె (హాట్‌షాట్స్)పై విజయం సాధించారు. దీంతో ఢిల్లీ 3-2తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
కాగా, అర్ధరాత్రి వరకు క్రికెట్ మ్యాచులు జరిగినా చూస్తున్న అభిమానులు బ్యాడ్మింటన్ ఎందుకు చూడరని సైనా ప్రశ్నించింది. ఐబిఎల్ మ్యాచులు అర్ధరాత్రి దాకా జరగడంపై వచ్చిన వ్యాఖ్యలపై ఆమె స్పందించింది. అర్ధరాత్రి క్రికెట్ మ్యాచులు వస్తుంటే చూస్తున్నారని, అలాగే బ్యాడ్మింటన్‌తో వచ్చిన ఇబ్బంది ఏమిటన్నారు. కాగా గాయం కారణంగా ఢిల్లీకి చెందిన గుత్తా జ్వాలా ఈ మ్యాచులో ఆడలేదు.