
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపికా అమెరికాకు చెందిన అమందా సోభీపై విజయం సాధించింది. ప్రారంభం నుంచే నిలకడగా ఆడిన దీపిక ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. స్క్వాష్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. చక్కని ఫామ్‌లో ఉన్న 11వ సీడ్ దీపిక 11-5, 11-7, 12-10తో సోబిని ఓడించింది. గత మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ను ఓడించిన సోబికి ఈ మ్యాచ్‌లో చెమటలు పట్టించింది.
ఆస్ట్రేలియన్ స్క్వాష్ ఓపెన్ సెమీస్‌లో ప్రవేశించడంపై దీపిక పల్లికల్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం తాను ఇక్కడ క్వాలిఫయర్‌గా ఆడి మెయిన్ డ్రాకు అర్హత సాధించానని తెలిపింది. గతేడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగానని... ఇప్పుడు 11వ సీడ్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్లోకి ప్రవేశించడం ప్రత్యేక అనుభూతి అని చెప్పింది.
తెలుగు వన్ఇండియా