Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పారిస్‌కు ఫైనల్‌తో గుడ్‌బై: కన్నీళ్లు పెట్టుకున్న బెక్‌హామ్

 David Beckham tears up at final home game
పారిస్: ఈ సీజన్ తర్వాత అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైరవుతానని ఇప్పటికే ప్రకటించిన ఇంగ్లాండ్ సాకర్ వీరుడు డేవిడ్ బెక్‌హామ్ పారిస్ సెయింట్ జర్మయిన్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. లీగ్-1 చాంపియన్‌షిప్స్‌లో భాగంగా బ్రెస్ట్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత, మైదానమంతా తిరిగిన బెక్‌హామ్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు.

ప్రేక్షకులకు అభివాదం చేస్తూ, వీడ్కోలు చెప్పాడు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు మ్యాచ్ జరుగుతున్నంత సేపూ అతని పేరును జపించారు. ప్లకార్డులు ప్రదర్శించి అతనిపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడి వీడ్కోలు చెప్పడంతో బెక్‌హామ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

గత వారం లియాన్ జట్టును ఓడించిన వెంటనే పారిస్ సెయింట్ జర్మయిన్‌కు లీగ్-1 చాంపియన్‌షిప్ ట్రోఫీ ఖాయమైంది. బ్రెస్ట్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత, నిర్వాహకులు ట్రోఫీని పారిస్ సెయింట్ ఆటగాళ్లకు అందచేశారు. 1994 తర్వాత మొదటిసారి ఈ జట్టు లీగ్-1 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంలో బెక్‌హామ్ కీలక పాత్ర పోషించడం విశేషం.

అతను మైదానంలో ఉన్న సమయంలో పారిస్ సెయింట్ ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంతో చెలరేగిపోయారు. బెక్‌హామ్ తమ మధ్య ఉన్నాడన్న ధైర్యం వారిలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. తమతో కలిసి అతను ఆడడం ఇదే చివరిసారి కావడంతో, పారిస్ సెయింట్ ఆటగాళ్లు డీలాపడ్డారు. అనంతరం ఘనంగా వీడ్కోలు పలికారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+