
తమ తొలి మ్యాచ్‌లో రష్యా చేతిలోభారీ పరాజయంతో ఓడిన చెక్ రిపబ్లిక్ ఈ మ్యాచ్‌లో మాత్రం జాగ్రత్తగా ఆడింది. ప్రథమార్థంలో పోలండ్ పైచేయి సాధించినప్పటికీ ద్వితీయార్థంలో ఆ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేకపోయింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న చెక్ రిపబ్లిక్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. 72వ నిమిషంలో వీరి ప్రయత్నం ఫలించింది. మిలన్ బరోస్ ఇచ్చిన పాస్‌ను తీసుకున్న జెరాసిక్ కుడి కాలితో బంతిని నేర్పుగా తన్ని జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించడంతో పాటు గ్రూప్ టాపర్‌గా జట్టును నాకౌట్‌కు చేర్చాడు. లీగ్ దశలో చెక్ రెండు విజయాలు సాధించగా, ఓ ఓటమి పాలైన విషయం తెలిసిందే.
UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు
రాత్రి 12.15 గంటలకు ఇటలీ వర్సెస్ ఐర్లాండ్, నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 12.15 గంటలకు నుంచి స్పెయిన్ వర్సెస్ క్రొయేషియా, నియో ప్రెమ్‌లో ప్రత్యక్ష ప్రసారం
తెలుగు వన్ఇండియా