Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గ్రీస్‌పై చెక్ రిపబ్లిక్ విజయం, 6 నిమిషాల్లో రెండు గోల్స్

Czech Republic a 2-1 win over Greece
వ్రోక్లా (పోలండ్), జూన్ 13: యూరో 2012 టోర్నమెంట్లో గ్రూప్ 'ఎ'లో తమ తొలి లీగ్ మ్యాచ్‌లో 1-4 గోల్స్ తేడాతో ఓడిన చెక్ రిపబ్లిక్ జట్టు, రెండో మ్యాచ్‌లో గ్రీస్‌పై తన సత్తా చాటింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ 2-1 గోల్స్ తేడాతో '2004 యూరో చాంపియన్' గ్రీస్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. చెక్ రిపబ్లిక్ తరఫున పీటర్ జిరాసెక్, వక్లావ్ పిలార్ ఒక్కో గోల్ చేయగా... గ్రీస్ జట్టుకు జెకాస్ ఏకైక గోల్‌ను అందించాడు.

యూరో 2012: చెక్ రిపబ్లిక్ జట్టు

తొలి మ్యాచ్‌లో రష్యా ఆడిన ఆటతీరుతో స్ఫూర్తి పొందిందో ఏమోగానీ చెక్ రిపబ్లిక్ ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడితే పోయేదేం లేదన్నట్లు ఆట ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసింది. ఈ ఎత్తుగడ చెక్ రిపబ్లిక్‌కు విజయాన్ని సాధించి పెట్టింది. గ్రీస్ రక్షణపంక్తి కుదురుకునేలోపే చెక్ జట్టు మొదటి ఆరు నిమిషాల్లోనే రెండు గోల్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఐదు దశాబ్దాల 'యూరో' టోర్నమెంట్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో తొలి ఆరు నిమిషాల్లోనే ఒక జట్టు రెండు గోల్స్ చేయడం ఇదే తొలిసారి.

యూరో 2012: గ్రీస్‌ జట్టు

ఆట 3వ నిమిషంలో మధ్య భాగంలో నుంచి తొమాస్ హబ్స్‌మాన్ ఇచ్చిన పాస్‌ను 'డి' ఏరియా అంచున పీటర్ జిరాసెక్ అందుకున్నాడు. ఎడమకాలితో బలమైన షాట్ కొట్టి గ్రీస్ గోల్‌కీపర్ కొస్తాస్ చకియాస్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో చెక్ రిపబ్లిక్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్ నుంచి కోలుకునేలోపే గ్రీస్‌కు మరో మూడు నిమిషాల తర్వాత చెక్ రిపబ్లిక్ మరో షాక్ ఇచ్చింది. ఆట 6వ నిమిషంలో కుడి వైపు నుంచి థియోడార్ గెబ్రెసెలాసీ కొట్టిన షాట్ గోల్‌కీపర్ కొస్తాస్ చకియాస్ చేతులకు తాకుతూ వెళ్లింది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ వివరాలు

యూరో 2012 గ్రూప్స్ వివరాలు

యూరో 2012 జట్ల వివరాలు

యూరో 2012 మ్యాచ్ వివరాలు

గోల్‌పోస్ట్ ముందు ఉన్న వక్లావ్ పిలార్ సమయోచితంగా స్పందించి బంతిని లక్ష్యానికి పంపించాడు. దాంతో చెక్ రిపబ్లిక్ 2-0తో ముందంజ వేసింది. వెంటవెంటనే రెండు గోల్స్ కావడంతో గ్రీస్ జట్టు డీలా పడింది. ఆ జట్టు చెక్ రిపబ్లిక్ మరిన్ని గోల్స్ చేయకుండా కట్టడి చేయాలనే ఆలోచనతో ఆడింది. మరోవైపు తిరుగులేని ఆధిక్యం ఉండటంతో చెక్ జట్టు తమ జోరును కొనసాగించారు. విరామ సమయానికి చెక్ రిపబ్లిక్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలో గ్రీస్ జట్టులోకి ఫొటాకిస్ స్థానంలో ఫానిస్ జెకాస్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అతని రాక గ్రీస్ జట్టుకు కలిసొచ్చింది. ఆట 53వ నిమిషంలో చెక్ రిపబ్లిక్ గోల్‌కీపర్ పీటర్ సెచ్ తప్పిదంతో గ్రీస్ తొలి గోల్ నమోదు చేసింది. హొలెబాస్ కొట్టిన షాట్ నేరుగా పీటర్ సెచ్ వద్దకు వచ్చింది. బంతిని ఒడిసి పట్టుకోబోతున్న తరుణంలో డిఫెండర్ తొమాస్ సివోక్ అడ్డురావడంతో సెచ్ తడబడ్డాడు.

సెచ్ చేతులకు తాకుతూ పక్కకు వచ్చిన బంతిని అక్కడే ఉన్న ఫానిస్ జెకాస్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో గ్రీస్ ఖాతా తెరిచింది. అయితే ఈ తప్పిదం నుంచి తేరుకున్న చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు మిగతా సమయాన్ని జాగ్రత్తగా ఆడి గ్రీస్ ఓటమిని ఖాయం చేశారు. ఈసారి 'యూరో' క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో ఏ జట్టుకూ ఒకే మ్యాచ్‌లో రెండు గోల్స్ సమర్పించుకోని గ్రీస్ ప్రధాన టోర్నమెంట్‌లో మాత్రం విఫలమైంది.

యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

రాత్రి 9.30 గంటలకు డెన్మార్క్ వర్సెస్ పోర్చుగల్

రాత్రి 12.15 గంటలకు నుంచి నెదర్లాండ్స్ వర్సెస్ జర్మనీ

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+