క్రొయేషియాతో డ్రా, క్వార్టర్స్‌కు ఇటలీ అనుమానమే

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
దీంతో స్పెయిన్‌తో జరగనున్న చివరి మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఓడిస్తే నాకౌట్‌కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇటలీ ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచినా... నాకౌట్‌కు చేరాలంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరున్న ఇటలీ, క్రొయేషియా అద్బుతమైన ఆట తీరుతో అభిమానులను అలరించాయి. ఆరంభంలో క్రొయేషియా వరుస దాడులు చేసినా ఇటలీ కెప్టెన్, గోల్‌కీపర్ బఫన్ సమర్ధంగా అడ్డుకున్నాడు. క్రమంగా వేగం పెంచిన ఇటలీ ఎదురుదాడికి దిగింది. బలోటెలీ, క్యాసనో ఇద్దరూ రెండు మంచి అవకాశాలను వృథా చేశారు.
యూరో 2012 జట్లు | యూరో 2012 మ్యాచ్‌లు
ఆట 39వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను పిర్లో అద్భుతంగా గోల్‌పోస్ట్‌లోకి పంపి ఇటలీ శిబిరంలో ఉత్సాహం పెంచాడు. ద్వితీయార్ధంలోనూ రెండు జట్లూ ఎటాకింగ్ ఆటకే ప్రాధాన్యత ఇచ్చాయి. ఆట 72వ నిమిషంలో ఇవాన్ ఇచ్చిన లాంగ్‌పాస్‌ను అద్భుతంగా నియంత్రించిన మాంజుకిక్ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లూ హోరాహోరీగా పోరాడినా ఎవరికీ గోల్ దక్కలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
యూరో 2012: ఈరోజు జరుగు మ్యాచ్‌లు నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 9.30 గంటలకు ఫ్రాన్స్ వర్సెస్ ఉక్రెయిన్
రాత్రి 12.15 గంటలకు నుంచి ఐర్లాండ్ వర్సెస్ స్వీడన్
తెలుగు వన్ఇండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications