For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రేప్ కేసులో మాజీ అథ్లెట్ పింకీ ప్రమాణిక్‌‌కు బెయిల్

By Nageswara Rao
Court grants bail to former athlete Pinki Pramanik in rape case
కోల్‌కత్తా, జులై 10: రేప్ కేసులో జైల్లో ఊసలు లెక్కపెడుతున్న మాజీ అథ్లెట్ పింకీ ప్రమాణిక్‌కు కోల్‌కత్తా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. పింకీ మహిళ కాదని, ముమ్మాటికీ పురుషుడేనని, పైగా తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జూన్ 14వ తారీఖున పింకీ ప్రామాణిక్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పింకీ ప్రామాణిక్ మహిళనా లేక పురుషుడా అన్న విషయంలో లింగ నిర్ధారణ పరీక్షలు ముగిసి, నివేదిక కూడా సిద్ధమైంది. ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రి వర్గాలు నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికను ఈరోజు మధ్యాన్నం కోర్టుకు సమర్పించనున్నారు.

ఇక పింకీ ప్రామాణిక్‌ భారత మహిళా అథ్లెట్. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనెవెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్‌లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.

ఇటీవలే ఈమె పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది.

ఇంతకీ పింకీ మహిళనా లేక పురుషుడా అన్నది తేలాల్సి ఉంది. బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు రుజువైతే, మన దేశంలో ఒక పురుషులు తప్పుడు సమాచారమిచ్చి మహిళల విభాగంలో పోటీ పడిన తొలి కేసుగా నమోదవుతుంది. ఇలావుంటే, పింకీలో పురుషులకు ఉండే హార్మోన్లు ఎక్కువగా ఉన్నాయని బెంగాల్ అథ్లెటిక్స్ సంఘం అధికారులు తెలిపారు. దోహా ఆసియా గేమ్స్ తర్వాత ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పురుషుల హార్మోన్లు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఒక మహిళా అథ్లెట్‌ను పోటీ నుంచి తొలగించడంగానీ, మహిళల విభాగంలో పోటీ చేయరాదని నిషేధించడంగానీ జరగదని స్పష్టం చేశారు.

దీనితో పాటు ఆసియా కామన్‌వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన అథ్లెట్ పింకీ ప్రామాణిక్‌‌ను తూర్పు రైల్వే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. టికెట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న పింకీ ప్రామాణిక్‌ను సస్పెండ్ చేసినట్లు తూర్పూ రైల్వే అధికార ప్రతినిధి సమీర్ గోస్వామి చెప్పారు. సర్వీసు నిబంధనల ప్రకారం ఓ ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతను సస్పెన్షన్‌కు గురవుతాడని ఆయన చెప్పారు. లింగం విషయంలో నేరం చేసినట్లు రుజువైతే పింకీ ఉద్యోగం ఊడుతుంది. పింకీ సాధించిన పతకాలు కూడా వెనక్కి తీసుకుంటారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+