Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్యానా ప్రభుత్వం కోటి.. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు

 Gagan Narang
హైదరాబాద్, ఆగస్టు1: లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి ఆంధ్రప్రదేశ్‌కు వన్నె తెచ్చిన హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్‌కి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు నజరానా ప్రకటించింది. భారతదేశానికి తొలి కాంస్య పతకాన్ని సాధించిన నారంగ్‌ను సిఎం కిరణ్‌తో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి భీమ్‌సేన్‌ నారంగ్‌ సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా నారంగ్‌ తండ్రి భీమ్‌సేన్‌ను శాలువ కప్పి సత్కరించారు.

రైఫిల్‌ షూటింగ్‌లో గగన్‌ నారంగ్‌ సాధించిన కాంస్య పతకం వలన క్రీడా రంగంలో రాష్ట్ర ప్రాధాన్యత మరింత పెరిగిందని సిఎం కిరణ్ పేర్కొన్నారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు 'మోడల్ స్పోర్ట్స్ పాలసీ'ని రూపొందించే ఆలోచన చేస్తున్నామన్నారు. కేంద్ర క్రీడాప్రాథికార సంస్ధ(శాయ్‌)లో శిక్షకుడిగా నియమిస్తామని కేంద్ర మంత్రి అజయ్‌ మాకెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతక ముందు నారంగ్‌కు హర్యానా ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్ రికార్డులు:
ఒలింపిక్ పతకం (కాంస్యం)
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం (కాంస్యం)
ప్రపంచకప్‌లలో నెగ్గిన పతకాలు ఆరు
ఆసియా క్రీడల్లో సాధించిన పతకాలు ఐదు
కామన్వెల్త్ క్రీడల్లో నెగ్గిన స్వర్ణాలు ఎనిమిది
ఆఫ్రో-ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం
ఆసియా చాంపియన్‌షిప్‌లో నెగ్గిన పతకాలు నాలుగు

షూటింగ్‌లో భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది మూడో మెడల్. 2004 ఏథెన్స్‌లో రాథోడ్ (రజతం), 2008 బీజింగ్‌లో బింద్రా (స్వర్ణం) సాధించారు.

ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇది ఎనిమిదో వ్యక్తిగత పతకం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒలింపిక్ పతకాలు సాధించిన క్రీడాకారులు మల్లీశ్వరి, గగన్ నారంగ్

గగన్ నారంగ్ వ్యక్తిగతం:
పుట్టిన తేదీ, స్థలం: మే 6, 1983, చెన్నై
నివాసం: హైదరాబాద్
ఎత్తు: 5 అడుగుల 8 అంగుళాలు
బరువు: 95 కేజీలు
చదువు: బీసీఏ
ఉద్యోగం: ఎయిరిండియా
హాబీలు: ఫొటోగ్రఫీ, టేబుల్ టెన్నిస్, క్రికెట్
పాల్గొనే ఈవెంట్స్: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 50 మీటర్ల రైఫిల్ ప్రోన్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్
అవార్డులు: అర్జున (2005), పద్మశ్రీ (2010)
రాజీవ్ ఖేల్ రత్న(2011)

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+