డోనెట్సెక్(ఉక్రెయిన్), జూన్ 24: యూరో-2012 టోర్నమెంట్‌లో ఈరోజుతో క్వార్టర్ ఫైనల్స్ ముగియనున్నాయి. ఇక సెమీ ఫైనల్స్‌కు తెరలేవనుంది. మొన్న జర్మనీ, గ్రీస్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో జర్మనీ సెమీ పైనల్స్ కు రాగా.. యూరోకప్ ఫుట్ టోర్నమెంట్‌లో వరల్డ్ కప్, డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ సెమీఫైనల్లోకి దూసుకు వచ్చింది. క్వార్టర్ ఫైనల్-3లో ఫ్రాన్స్ ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. వందో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్పెయిన్ ఆటగాడు జబీ అలోన్సో రెండు గోల్స్ తో జట్టును సెమీస్‌కు చేర్చాడు. బుధవారం జరిగే సెమీఫైనల్లో పోర్చుగల్ జట్టుతో స్పెయిన్ తలపడుతుంది.

UEFA యూరో 2012 రిజల్ట్స్ | యూరో 2012 గ్రూప్స్
ఆరేళ్ల క్రితం 2006 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ చేతిలో ఓడిన స్పెయిన్ ఈసారి బదులు తీర్చుకుంది. స్టార్ ఆటగాళ్లతో నిండిన స్పెయిన్ ఈ మ్యాచ్‌లో అన్ని అంశాల్లో తమ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. చిన్న చిన్న పాస్‌లతో ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్తూ... అదే సమయంలో ఫ్రాన్స్ ఎదురుదాడులను మధ్యలోనే తుంచేస్తూ మ్యాచ్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆట 19వ నిమిషంలో ఆండ్రియా ఇనియెస్టా అందించిన క్రాస్ పాస్‌ను కుడి వైపు నుంచి 'డి' ఏరియాలో ఉన్న జాబి అలోన్సో డైవ్ చేస్తూ హెడర్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో స్పెయిన్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
తర్వాత స్పెయిన్ పాసింగ్ రిథమ్ కోల్పోయింది. దాంతో గోల్స్ రావడం కష్టమైంది. ఫ్రాన్స్‌కు ఒక ప్రి కిక్ అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. స్పెయిన్ గోల్ కీపర్ ఇకెర్ కాసిల్లాస్ బంతి సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధ భాగంలో రెండు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా అలెన్సో మరో గోల్‌తో స్పెయిన్ ఆధిక్యాన్ని 2-0కు పెరిగింది. అలెన్సోకు ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 'మేము బాగా ఆడాం. మ్యాచ్ మొత్తం మా నియంత్రణలో ఉంచుకున్నాం. మ్యాచ్ అంతా సులువుగా ఏం లేదు. మేము గొప్ప మ్యాచ్ ఆడామని భావిస్తున్నా.'అని మ్యాచ్ అనంతరం అలెన్సో తెలిపాడు.
యూరో 2012 జట్లు| యూరో 2012 మ్యాచ్‌లు
ఈరోజు జరుగు మ్యాచ్: నియో స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాత్రి 12.15 గంటలకు నుంచి ఇంగ్లండ్ వర్సెస్ ఇటలీ (క్వార్టర్ ఫైనల్-4)
తెలుగు వన్ఇండియా