
తర్వాతి రౌండ్‌లో తన ఫేవరెట్ అయిన స్ట్రయిట్ పంచ్‌లను విసురుతూ 4-3 స్కోరును సాధించాడు. ఆఖరి మూడు నిమిషాల్లోనూ తన జోరు ఏమాత్రం తగ్గకుండా ఆధిపత్యం కనబర్చాడు. లైట్ వెయిట్ (60 కేజీ) బౌట్‌లో జై భగవాన్ 18-8తో ఆండ్రి క్ అలిసోవ్ (సీషెల్స్)ను ఓడించాడు. తద్వారా ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. తొలి రెండు రౌండ్లలో పంచ్‌ల వర్షం కురిపించిన భగవాన్ 14 పాయింట్లు సాధించాడు. చివరి రౌండ్‌లో మరో 4 పాయింట్లు గెలిచి బౌట్‌ను సొంతం చేసుకున్నాడు.
జ్వాలా - దిజు జోడీ పరాజయాల బాట:
ఒలింపిక్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాలా గుత్తా - దిజు జోడీ పరాజయాల బాట పట్టింది. శనివారం నాడు జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఈ భారతీయ జోడీ ఆదివారం నాడు జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్‌లో సైతం చేతులెత్తేసింది. 2009లో ప్రపంచ ఛాంపియలో టైటిల్ కైవసం చేసుకున్న డెన్మార్క్ జోడీ థామస్ లైబర్న్-కమిల్లా రిట్టర్ జుహ్లతో ఢీ కొన్న జ్వాలా-దిజు 12-21, 16-12 తేడాతో మ్యాచ్ కోల్పోయింది. కేవలం అరగంట పాటు సాగిన మ్యాచ్‌లో ఈ 13వ ర్యాంక్ భారత జోడీ ప్రత్యర్థికి ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే మ్యాచ్‌ని కోల్పోయింది. మంగళవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో వీళ్లు.... యంగ్ డా లీ-జుంగ్ యున్ హ (కొరియా)లతో తలపడుతారు.
మహిళల ఆర్చరీ టీమ్ కూడా నిరాశే:
పతకం సాధిస్తారేమో.. అని ఆశగా ఎదురు చూసిన అభిమానులకు మహిళల ఆర్చరీ టీమ్ కూడా నిరాశే మిగిల్చింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం దీపికా కుమారి, బొంబ్యాలా దేవి, చెక్రొవోలు స్వురో నాకౌట్ దశకు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. హోరాహోరీగా సాగిన క్వాలిఫయింగ్ రౌండ్లో భారత్ ఒకపాయింట్ (210-211) తేడాతో డెన్మార్క్ చేతిలో ఓటమిపాలైంది. గట్టెక్కిస్తుందనుకున్న దీపిక తడబడగా, బొంబ్యాల దేవి పోరాటం వృథా అయింది. చెక్రుకోలు తీవ్రంగా నిరాశపర్చింది. కాగా, ఈరోజు నుంచి మొదలయ్యే వ్యక్తిగత విభాగంలో మన ఆర్చర్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అమ్మాయిలూ షూటవుట్..:
మహళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత అమ్మాయిలు హీనా సిద్దు, అన్నూరాజ్ సింగ్ గురి తప్పింది. ఇదే ఈవెంట్ పురుషుల విభాగంలో విజయ్ కుమార్ క్వాలిఫయింగ్‌లోనే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళా షూటర్లు హీనా సిద్దు, అన్నురాజ్ సింగ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో 382 పాయింట్లు సాధించిన అన్ను హీనా సిద్ధు 12వ స్థానం, అన్నురాజ్ సింగ్ 378 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచి ఫైనల్స్ (టాప్-8)కు అర్హత సాధించలేకపోయారు.
క్వార్టర్స్‌లో స్వరణ్ సింగ్:
రోయింగ్‌లో భారత కుర్రాడు స్వరణ్ సింగ్ విర్క్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ స్కల్ రెప్‌చేజ్ రౌండ్‌లో స్వరణ్ 7:00.40 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు. 2 కిలో మీటర్ల పొడవుగల ఈ రేసులో కిమ్ డంగ్‌యంగ్ (కొరియా-7:03.49 సెకన్లు) నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్ హీట్స్‌లో సందీప్ కుమార్, మన్‌జిత్ సింగ్ జోడి 6:56.60 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
టిటిలో సౌమ్యజిత్ ఓటమి:
ఎంతో ఛాలెంజ్‌గా తీసుకొని పోటీలోకి దిగిన భారత టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారుడు సౌమ్యజిత్ గోష్ ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడాడు. ఆరంభంలో ప్యర్థిపెై ఎదరుదాడి చేసి తొలి రౌండ్‌ను 11-9తో నెగ్గిన గోష్ అనంతరం పూర్తిగా నీరుగారిపోయాడు. ఉత్తర కొరియాకు చెందిన హియోక్ బోంగ్ కిమ్‌కి ఆరంభంలో చుక్కలు చూపిన సౌమ్యజిత్ పేలవమైన షాట్లతో మ్యాచ్‌పెై పట్టుకోల్పోయాడు. తర్వాత జరిగిన మూడు రౌండ్లలో 6-11, 5-11, 9-11 తేడాతో వరుస సెట్లను కోల్పోయి చేతులెత్తేశాడు.
తెలుగు వన్ఇండియా