
రాయల్ ఆర్టిలరీ బ్యారక్స్‌లో తొలుత క్వాలిఫికేషన్ రౌండ్‌లో వీళ్లు పోటీపడతారు. ఆ తర్వాత ఫైనల్ జరుగనుంది. నాలుగేళ్ల క్రితం సాధించిన ఘనత గతమని బింద్రా చెబుతున్నాడు. 'గతాన్ని తలుచుకోవడం అనవసరం. నేను బీజింగ్ ప్రదర్శన దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం షూటింగ్‌లో స్వర్ణం సాధించిన మాట నిజమే అయినా అది అక్కడితోనే అయిపోయింది' అని నాలుగోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న బింద్రా స్పష్టం చేశాడు.
అభినవ్ బింద్రాతో పాటు హైదరాబాద్‌కు చెందిన గగన్ నారంగ్ పై కూడా అందరి చూపు ఉంది. గత ఒలింపిక్స్‌లో సాధించలేనిది ఈ సారి తప్పకుండా సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. ఈ సందర్బంలో నారంగ్ మాట్లాడుతూ సాదారణంగా టెన్నిస్, స్విమ్మింగ్ లో మాదిరి షూటింగ్‌లో ఫేవరేట్స్ ఉండరు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అగ్రస్దానంలో నిలిచిన వారికి, చివరి స్దానంలో నిలిచిన వారికి కేవలం కొద్ది పాయింట్లు తేడా మాత్రమే ఉంటుంది. ఫైనల్లో ఎలా ఆడతారనేది ముఖ్యం.
ముఖ్యంగా షూటింగ్‌లో చైనా షూటర్ జు కినస్ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బీజింగ్‌లో తనను బింద్రా ఓడించాడు. 10మీ. ఎయిర్ రైఫిల్ తోపాటు గగన్ 50మీ. రైఫిల్ ప్రోన్ (ఆగస్టు3), 50మీ. రైఫిల్ 3 పొజిషన్ (ఆగస్టు 6)లోనూ పాల్గొంటున్నందున ఏదో పతకం వస్తుందని ఆశిస్తున్నాడు.
షూటింగ్ క్వాలిఫికేషన్:
మధ్యాన్నం 1.30 గంటల నుండి
ఫైనల్ సాయంత్రం 4.45 గంటలకు
తెలుగు వన్ఇండియా