లండన్, జులై 27: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఒకవైపు ఈలలు, మరోవైపు అభిమానుల చప్పట్లు, కేరింతలు మధ్య ఒలింపిక్ జ్యోతి చేతబూని బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురువారం ఇక్కడ సౌత్ వార్క్‌లో ఆకర్షణగా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు రోజు జరిగి న రిలే కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడు.

తెల్లని స్పోర్టింగ్ ట్రాక్‌లో మెరిసిన 69 యేళ్ల బిగ్ బి.. అభిమానులు ప్రోత్సహిస్తుండగా.. 300 మీటర్ల దూరం పాటు పరిగెత్తుతూ.. కాసేపు నడుస్తూ మధ్య మధ్యలో అభిమానులకు అభివాదం చేస్తూ రిలే ముగించారు. క్రీడా జ్యోతి పర్యటన గురువారం నాడు 69 రోజుల తన పర్యటనను పూర్తి చేసుకున్న క్రీడా జ్యోతి 69 సంవత్సరాల వయసున్న అమితాబ్ చేతిలోకి రావడం విశేషం. క్రీడా జ్యోతి ర్యాలీలో పాల్గొనడానికి తనను ఆహ్వానించడం ఎంతో గర్వంగా ఉందని, భారతదేశం తరపున ఈ జ్యోతిని నేను అందుకోవడం ఎంతో ఆనం దంగా ఉందని బిగ్‌బీ చెప్పాడు.
ఇటీవలే అమితాబ్‌కు శస్త్ర చికిత్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అమితాబ్‌తో పాటు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాస్ కీ మూన్, వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ పాల్గోన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న బిగ్ బి ఇలా ఒలింపిక్ టార్చ్ రిలే రేసులో పాల్గోనడాన్ని ఇక్కడ టివి ఛానల్స్ ప్రముఖంగా చూపించాయి. ఈ విషయాన్ని అమితాబ్ ఇంతకుముందే ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ అవకాశం రావడం తనకు, దేశానికి గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశాడు. కార్యక్రమానికి లండన్ ఒలింపిక్ నిర్వాహక కమిటీ తనను ఆహ్వానించినట్టు బాలీవుడ్ సూపర్ స్టార్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా