Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పొరపాటే అశ్వినికి శాపం, అధిక ధరపై ప్రద్న్య ఆశ్చర్యం

 Ashwini Ponnappa
న్యూఢిల్లీ: ఐబిఎల్‌లో అశ్విని పొన్నప్పకు అంత తక్కువ రేటు రావడానికి అధికారులే కారణమని తెలుస్తోంది. వేలంలో తన డబుల్స్ భాగస్వామి ప్రద్న్య గాద్రే కన్నా అశ్వినికి సుమారు 50 శాతం తక్కువ రేటు పలికింది. సోమవారం ఐబిఎల్ వేలంలో ప్రద్న్య గాద్రేను రూ.27 లక్షలకు కొనుగోలు చేశారు. అశ్వినికి మాత్రం రూ.14 లక్షలే దక్కాయి. దీనికి అధికారులు చేసిన తప్పిదమే కారణంగా తెలుస్తోంది.

వేలం సమయంలో ఫ్రాంచైజీ ఓనర్లకు ఇచ్చిన ప్లేయర్ కార్డుల్లో అశ్విని సాధించిన విజయాలు ప్రద్న్య సాధించినవిగా చూపించారట.ప్రద్న్య 2012లో తొలిసారి జాతీయ డబుల్స్‌ను గెలిచింది. 2011లో స్విస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గింది. అయితే అశ్విని-జ్వాల జోడీ గెలిచిన 2010 కామన్వెల్త్ డబుల్స్ స్వర్ణాన్ని, 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతకాన్ని ప్రద్న్య ఖాతాలో వేశారట.

ఇక ఈ ఏడాది మలేసియా ఓపెన్‌లో అశ్విని-ప్రద్న్య జోడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. అది కూడా ప్రద్న్య పేరునే నమోదు చేశారట. ఐకాన్ ప్లేయర్‌గా ఒప్పందం కుదుర్చుకున్న తాను తక్కువ ధర పలకడంపై అశ్విని మండిపడింది. తన భాగస్వామికి ఎక్కువ రేటు దక్కడం, తనకి మాత్రం తక్కువ రేటు పలకడం ఏమిటో అర్థం కావడం లేదని వాపోయింది.

నమ్మలేకపోయిన ప్రద్న్య

ఐబిఎల్ వేలంలో కనీస ధర తగ్గించడంపై జ్వాలా, అశ్విని పొన్నప్పలు మండిపడుతుంటే మరోవైపు ప్రద్న్య గాద్రె సంతోషపడుతోంది. వేలంలో తాను 27.5 లక్షలు పలకడం నమ్మలేకపోయానని ప్రద్న్య చెప్పారు. ఇంత ధర పలుకుతుందని తాను ఊహించలేదని, ఆశ్చర్యపోయానని చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+