
అంతకు ముందు ఆమె టాటా ఆర్చరీ అకాడమీలో కెడెట్‌గా శిక్షణ పొందింది. భారత ఆర్చరీ సమాఖ్య గుర్తింపును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడంతో, రికర్వ్ ఈవెంట్ శిక్షణ శిబిరాన్ని సాయ్ కేంద్రంలో కాకుండా, ఆర్మీ ఆర్చరీ సెంటర్‌లో ఏర్పాటు చేశారు.
శుక్రవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్‌కు ప్రతిమ హాజరుకాకపోవడంతో, ఇతర ఆర్చర్లు ఆమె గదికి వెళ్లారు. దాంతో ఈ విషయం తెలిసింది. ప్రతిమ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా ఆమె మానసికంగా కుంగిపోయినట్టు కనిపిస్తున్నదని, అయితే, వివరాలు మాత్రం తెలియవనీ తోటి ఆర్చర్లు అంటున్నారు.
సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. అస్సాంకు చెందిన అంతర్జాతీయ ఆర్చర్ ప్రతిమ రైల్వే ఉద్యోగి. సంఘటనపై దర్యాప్తు చేయించాలని అస్సాం అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు జయంత బోరో భారత ఆర్చరీ అసోసియేషన్, పూణే ఆర్మీ యంత్రాంగాన్ని, భారత క్రీడా సంఘాన్ని కోరారు. ఈ మేరకు లేఖలు రాశారు.